Homeటాప్ స్టోరీస్Revanth Reddy: ఇది రేవంత్ కు జరిగిన అవమానం కాదు.. తెలంగాణకు జరిగిన అన్యాయం

Revanth Reddy: ఇది రేవంత్ కు జరిగిన అవమానం కాదు.. తెలంగాణకు జరిగిన అన్యాయం

Revanth Reddy: ఎందుకు రేవంత్ రెడ్డిని బిజెపి అడ్డుకుంది.. అతడు ఆల్రెడీ లెటర్ రాశాడు కదా.. లండన్, అమెరికా వెళ్తున్నట్టు చెప్పాడు కదా.. అలాంటప్పుడు విదేశాంగ శాఖ అడ్డుకోవాల్సిన అవసరమేంది.. అప్పట్లో కెసిఆర్ అంటే దేశంలో గత్తర లేపడానికి ప్రయత్నాలు చేశాడు. కొన్ని పార్టీలకు ఆర్థికంగా సహాయం అందించాడు.. కానీ ఇక్కడ రేవంత్ అలా చేయడం లేదు కదా. పైగా ప్రధానమంత్రి తెలంగాణకి వచ్చినప్పుడు ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఆయనతో కలిసి వేదిక పంచుకుంటున్నాడు. కేంద్రం నిర్వహించే […]

Revanth Reddy: ఎందుకు రేవంత్ రెడ్డిని బిజెపి అడ్డుకుంది.. అతడు ఆల్రెడీ లెటర్ రాశాడు కదా.. లండన్, అమెరికా వెళ్తున్నట్టు చెప్పాడు కదా.. అలాంటప్పుడు విదేశాంగ శాఖ అడ్డుకోవాల్సిన అవసరమేంది.. అప్పట్లో కెసిఆర్ అంటే దేశంలో గత్తర లేపడానికి ప్రయత్నాలు చేశాడు. కొన్ని పార్టీలకు ఆర్థికంగా సహాయం అందించాడు.. కానీ ఇక్కడ రేవంత్ అలా చేయడం లేదు కదా. పైగా ప్రధానమంత్రి తెలంగాణకి వచ్చినప్పుడు ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఆయనతో కలిసి వేదిక పంచుకుంటున్నాడు. కేంద్రం నిర్వహించే ప్రతి సమావేశానికి హాజరవుతున్నాడు. తెలంగాణకు ఏం కావాలో అడుగుతున్నాడు. తను ఏమీ హిపోక్రసి చూపించడం లేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడైతే విదేశాలకు వెళ్లారో.. కొన్ని జాతీయ మీడియా సంస్థలు పనిగట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఫోకస్ చేశాయి. ఆయన దేశానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో మాటా మంతి నిర్వహిస్తున్నారని.. వారితో కలిసి మంతనాలు జరుపుతున్నారని రాయడం మొదలుపెట్టాయి. వాస్తవానికి ఇటువంటి వార్తలు రాస్తున్నప్పుడు క్లారిటీ తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు క్రాస్ చెక్ చేసుకుని ఉండాలి. అలా కాకుండా నోటికి వచ్చిందే మాట అనే మాదిరిగా వార్తలు రాసుకుంటూ పోతే అప్పుడు పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. జాతీయ మీడియా ఏదైతే రాసిందో.. దాన్ని పట్టుకొని గులాబీ మీడియా రాయడం మొదలుపెట్టింది. చూశారా రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి ఏం చేస్తున్నాడో అంటూ విపరీత అర్ధాలు తీయడం మొదలు పెట్టింది.

ఇది జరుగుతుండగానే కొండా సురేఖ ఎపిసోడ్ చోటు చేసుకోవడం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొండ సురేఖ కుమార్తె విమర్శలు చేయడం.. అవి తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. దీనికి తోడు రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లకుండానే లండన్ నుంచి నేరుగా వచ్చేశారు. దీంతో ఆయన అక్కడ మాట్లాడితే బాగోదని నిశ్శబ్దంగా ఉన్నారు. తెలంగాణకు వచ్చిన తర్వాత సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనేక విషయాలను పూసగుచ్చినట్టు వివరించారు. తన పర్యటనను అడ్డుకోవడం పూర్తిగా వివక్ష అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు, గుజరాత్ ముఖ్యమంత్రి కి ఇచ్చిన అవకాశాన్ని.. తనకు ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బిజెపి నేతలు విఫల యత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

తన పర్యటనను అడ్డుకున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని పార్లమెంట్లో మల్లికార్జున కార్గే.. రాహుల్ గాంధీ మాట్లాడతారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి ఆధారాలతో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మొత్తానికి బిజెపి వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు.”నరేంద్ర మోడీ ఎవరికి చెప్పి పాకిస్తాన్ వెళ్లారు. మీరు ఎవరికి చెప్పకుండా పాకిస్తాన్ వెళ్లొచ్చు. మేము మాత్రం విదేశాలకు వెళ్లకూడదా. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడకూడదా.. వివిధ రకాల ఒప్పందాలు చేసుకోకూడదా.. ఇది ముమ్మాటికి బిజెపి సాగిస్తున్న కక్ష. విదేశాంగ శాఖ అధికారి బిజెపిని చేరడం మంచిది.. తెలంగాణ ముఖ్యమంత్రిని డిక్టేట్ చేయడం ఏమాత్రం సరైన విధానం కాదని”రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తన అమెరికా పర్యటనను అడ్డుకున్న విదేశాంగ శాఖను రేవంత్ రెడ్డి గట్టిగానే అర్సుకున్నారు..

 

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper