Homeఎంటర్టైన్మెంట్Nagma: హీరోయిన్ నగ్మా గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎక్కడుందో.. ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు!

Nagma: హీరోయిన్ నగ్మా గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎక్కడుందో.. ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు!

Nagma: కొంతమంది ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ ని ఎన్ని జనరేషన్స్ దాటినా మరచిపోలేము. ఆరోజుల్లో తమ అందచందాలతో ఈ హీరోయిన్స్ కుర్రాళ్ళని ఒక ఊపు ఊపిన తీరు చూస్తే , ఇప్పటి హీరోయిన్స్ వాళ్ళ ముందు అసలు ఏ మాత్రం సరిపోరు అని చెప్పొచ్చు. కొంతమంది హీరోయిన్స్ కి అందం ఉంటే అభినయం ఉండదు, అభినయం ఉంటే అందం ఉండదు. ఈ రెండు కలిపి ఒక హీరోయిన్ లో చూడడం చాలా అరుదు. అలాంటి అరుదైన హీరోయిన్స్ […]

Nagma: కొంతమంది ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ ని ఎన్ని జనరేషన్స్ దాటినా మరచిపోలేము. ఆరోజుల్లో తమ అందచందాలతో ఈ హీరోయిన్స్ కుర్రాళ్ళని ఒక ఊపు ఊపిన తీరు చూస్తే , ఇప్పటి హీరోయిన్స్ వాళ్ళ ముందు అసలు ఏ మాత్రం సరిపోరు అని చెప్పొచ్చు. కొంతమంది హీరోయిన్స్ కి అందం ఉంటే అభినయం ఉండదు, అభినయం ఉంటే అందం ఉండదు. ఈ రెండు కలిపి ఒక హీరోయిన్ లో చూడడం చాలా అరుదు. అలాంటి అరుదైన హీరోయిన్స్ లో ఒకరి గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ హీరోయిన్ మరెవరో కాదు , నగ్మ. తెలుగు , తమిళం , హిందీ , మలయాళం భాషల్లో దాదాపుగా అందరి సూపర్ స్టార్స్ తో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని , అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈమె.

1990 వ సంవత్సరం లో ‘భాగీ’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 1991 వ సంవత్సరం లో ‘పెద్దింటి అల్లుడు’ చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమై తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత నగ్మ కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు తో పాటు హిందీ , తమిళం లో వరుస సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. 2008 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన నగ్మ, ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యింది. 2004 లోనే ఈమె కాంగ్రెస్ పార్టీ లో చేరి , అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో , సీఎం అభ్యర్థిగా నిలబడిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి ప్రచారం చేసింది.

ఇక 2008 తర్వాత సినిమాలకు టాటా చెప్పి , రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యి, 2014 వ సంవత్సరం లో మీరట్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పటికీ ఆమె రాజకీయాల్లో యాక్టీవ్ గానే ఉంది. కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా ఈమెకు చట్ట సభల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కలేదు. ఇకపోతే ఈమధ్య కాలం లో నగ్మ టీవీ మీడియా చానెల్స్ లో పెద్దగా కనిపించడం లేదు కానీ, సోషల్ మీడియా లో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంది. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో నగ్మ లుక్స్ ని చూసిన నేటి తరం ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ఆమె ఎలాంటి లుక్స్ తో ఉండేదో , ఇప్పటికీ అదే లుక్స్ తో ఉంది. ఇంత అందంగా ఫిజిక్ ని మైంటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఆమెకు సంబంధించిన ఫోటోలు మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Nagma A Morarji (@nagma_actress)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper