Mini Cooper Car: 59 లక్షల మినీ కూపర్ కారు.. జస్ట్ చిటికెలో కొనేసింది. మినీ కూపర్ కారు ప్రీమియం సెగ్మెంట్లో తోపు. ఈ కారు ఒకరకంగా చెప్పాలంటే ఇంద్ర భవనం లాగా ఉంటుంది. అందులో ఉన్న ఫీచర్లను చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అటువంటి కారును ఆ ఆడ సెలబ్రిటీ జస్ట్ ఇలా కొనేసింది. ఒకప్పుడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అంటే ఒకప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉండాలని మా అభిమతం కాదు. కాకపోతే ఈ స్థాయిలో సంపాదన ఎలా అనేదే అతిపెద్ద అనుమానం. మరి ఈ స్థాయిలో డబ్బులు పెట్టి విలాసవంతమైన వాహనాలను.. విలాసవంతమైన భవనాలను కొనుగోలు చేస్తున్న ఆ సెలబ్రిటీ.. అదే స్థాయిలో ఆదాయపు పన్ను చెల్లిస్తోందా.. అనేది ఒక పెద్ద డౌట్ అనుమానం..
ఆమె అప్పట్లో ఒక న్యూస్ ఛానల్లో ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ కు ఎంపికయింది.. ఆ తర్వాత చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను నిర్వహించే ఒక యాప్ కు ప్రమోషన్ చేసింది. వచ్చిన డబ్బుతో విలువైన స్థలాలు.. ఖరీదైన గృహాలు కొనుగోలు చేసింది. ఆమెకు యూట్యూబ్ ఛానల్ లో కూడా భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. హౌస్ టూర్.. పేరుతో గట్టిగానే సంపాదించినట్టు తెలుస్తోంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ప్రచారం చేసింది. తనతో పాటు కొంతమంది సెలబ్రిటీలతో ఆ పార్టీ రూపొందించిన ఒక పాటకు స్టెప్పులు కూడా వేసింది. అప్పట్లో ఈమె పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఒక నిషేధిత సంస్థకు ప్రమోషన్ నిర్వహించి విమర్శలు మూట కట్టుకున్నప్పటికీ.. డబ్బు సంపాదన మాత్రమే తెలిసిన ఆమెకు ఈ విమర్శలు ఒక లెక్క కాలేదు.
మణికొండ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన ఏరియాలో ఈమె గృహాన్ని నిర్మించుకుంది. దీని విలువ కోట్లలో ఉంటుంది. ఇక ఈమె ఉపయోగించే కారు విలువ కూడా అదే స్థాయిలో ఉంటుంది. తాజాగా దసరా సందర్భంగా మినీ కూపర్ కారు కొనుగోలు చేసింది. దీనిని బట్టి ఆమె సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె ఏ న్యూస్ ఛానల్లో పనిచేయడం లేదు. యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేయడం లేదు. అయినప్పటికీ ఆమె సంపాదన ఈ రేంజ్ లో ఉందంటే మామూలు విషయం కాదు. పైగా ఆమె భర్త గతంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేసేవారు.
ఇప్పుడు ఆయన ఆ ఉద్యోగం కూడా చేయడం లేదు. మొత్తంగా చూస్తే ఆమె సంపాదన మూడు పువ్వులు .. ఆరు కాయలు కాదు.. అంతకుమించి అనే స్థాయిలో ఉంది. అందువల్లే ఈ స్థాయిలో విలాసవంతమైన కార్లను.. విలాసవంతమైన గృహాలను కొనుగోలు చేస్తోందని విమర్శలు ఉన్నాయి. పైగా ఆమె తన లగ్జరీ లైఫ్ ను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. ప్రతి విషయాన్ని కూడా వీడియోల రూపంలో రూపొందించి.. సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ.. ఎన్ని రకాలుగా అభియోగాలు వచ్చినప్పటికీ.. ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయదు. ఎందుకంటే ఆమెకు బలమైన పొలిటికల్ సపోర్ట్ ఉంది.