Hizil JB, Kerala Pilot Success Story: జొమాటో డెలివరీ బాయ్ గా మొదలుపెట్టాడు.. విమానం స్థాయికి ఎదిగాడు.. ఒకవైపు చేతిలో డెలివరీ బ్యాగ్.. మరోవైపు మనసులో ఆకాశాన్ని తాకాలి అనే కల. ఒకప్పుడు బీటెక్ లో 20 బ్యాక్ లాగ్స్ తో ఇబ్బంది పడ్డాడు. కుటుంబాన్ని కుదిపేసిన ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. కోవిటి సమయంలో తండ్రిని కోల్పోయాడు. జీవితంలో ఒక్కో అడుగు ముందుకు వేయడమే కష్టంగా మారింది.
కలను వదులుకోలేదు
కానీ అతడు మాత్రం తన కలను వదులుకోలేదు. తన కలను త్యాగం చేయలేదు. సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. తనను తాను తిట్టుకోకుండా.. తన సమస్యలకు కృంగిపోకుండా.. ఏమాత్రం భయం అనేది లేకుండా.. ధైర్యాన్ని మాత్రమే నింపుకున్నాడు. వై మీ అనుకోకుండా.. ట్రై మీ అనుకున్నాడు.. ముందుగా జొమాటో డెలివరీ బాయ్ గా పని చేశాడు. ఆ తర్వాత గణితం ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పాడు. డ్రైవర్గా కష్టపడ్డాడు. ఇలా ఎన్నో కష్టాలు పడుతూ.. తన భవిష్యత్తు కోసం పోరాటం చేశాడు. చివరికి పదేళ్ల నిరీక్షణ తర్వాత ఫిలిప్పీన్స్ లో పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్నాడు.కేరళ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల హైజిల్ జెబీ ప్రయాణం ఇది. పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడిన ఓ యువకుడి కదా ఇది.. అసలు అతడు ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు.. తన కలను సాకారం చేసుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు.. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి..
కల చాలా పెద్దది
ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక కలవుంటుంది. కొందరికి మంచి ఉద్యోగం సంపాదించాలని ఉంటుంది. మరికొందరికి వ్యాపారవేత్త కావాలని ఉంటుంది. ఇంకొందరికి డాక్టర్ కావాలని.. మరికొందరికి ఇంజనీర్ కావాలని కలవుంటుంది. కానీ కొంతమందికి మాత్రం ఆకాశం మీ హద్దుగా ఉంటుంది. హైజిల్ జె బి కి కూడా అలాంటి ఒక కల ఉంది. పైలెట్ కావాలి.. విమానాన్ని ముందుకు నడపాలి.. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలి. అయితే కలకనడం ఒక ఎత్తు.. ఆ కలను నిజం చేసుకోవడం మరొక ఎత్తు..పైలట్ శిక్షణ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దానికి అవసరమైన అర్హతలు.. శిక్షణ.. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అంత ఈజీ కాదు. హై జిల్ ప్రయాణంలోనూ అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆయన తన లక్ష్యాన్ని చేరుకునే ఆలోచన ధోరణి మాత్రం మార్చుకోలేదు.
జీవితంలోనూ ఓడిపోయినట్టు కాదు
చదువులో ఎదురయ్యే వైఫల్యం చాలామందిని నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో వరుసగా సబ్జెక్టులు మిగిలిపోతే భవిష్యత్తుపై భయం విపరీతంగా మొదలవుతుంది. జేబీ విషయంలోనూ అలాంటి పరిస్థితి ఎదురైంది. బీటెక్లో ఏకంగా 20 బ్యాక్లాగ్స్ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తమ లక్ష్యాలను మార్చుకోవాలని అనుకుంటారు. మరికొందరు ఇతరులు ఏమనుకుంటారోనని భయపడి ప్రయత్నాలు చేసేందుకు వెనుకాడతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. చదువుల నుంచి ఎదురైన వైఫల్యం మనిషి జీవితానికి ఇచ్చేది తుది తీర్పు కాదు. ఒక పరీక్షలో ఓడిపోయినంత మాత్రాన జీవితంలోనూ ఓడిపోయినట్టు కాదు. హైజిల్ కు కూడా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే అతడి కథలో ముఖ్యమైన విషయం ఏంటంటే పరిస్థితిలో తనకు అనుకూలంగా లేవని కలను వదులుకోలేదు. అతడి ప్రయాణం మనకు చెప్పే విషయం ఒకటే మీ ప్రస్తుత పరిస్థితి మన ఫ్యూచర్ ను డిసైడ్ చేయదు.
అవకాశాల కోసం వేచి చూడాలి
ఇక జీవితంలో కొన్ని సంఘటనలు మనిషిని మానసికంగా ఇబ్బంది పెడతాయి. అలాంటి సమయంలో కుటుంబం అండగా నిలిస్తే ముందుకు సాగడం కొంత ఈజీ అవుతుంది. కానీ హైజిల్ జీవితంలో కోవిటి మహమ్మారి మరో పెద్ద విషాదాన్ని తీసుకొచ్చింది. ఆ సమయంలో తండ్రిని కోల్పోయాడు. ఒకవైపు తండ్రిని కోల్పోయిన బాధ.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు.. ఇంకోవైపు తన కలను నిజం చేసుకోవాలి అనే తపన. ఈ పరిస్థితుల్లో అతనికి ఎదురైన సమస్యలు సాధారణమైనవి కావు. పైలెట్ కావాలని లక్ష్యం ఉన్నప్పటికీ.. ఆ లక్ష్యానికి అవసరమైన ఆర్థిక స్థంపులు లేకపోతే ఎలా? కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు తన కల కోసం ఎలా ముందుకు వెళ్లాలి? ఇలాంటి ప్రశ్నలు అతడిని వెంటాడాయి. కాని జీవితంలో ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం లభించదు. కొన్నిసార్లు మనకు కావాల్సిన అవకాశాల కోసం వేచి చూడాలి. మరికొన్నిసార్లు మనమే అవకాశాలను సృష్టించుకోవాలి. హైజిల్ తన పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. కష్టపడి సంపాదించడం ద్వారా తన లక్ష్యానికి చేరువ కావాలని అనుకున్నాడు.
పైలెట్ కావాలనుకునే వ్యక్తి ఏం చేస్తాడు.. పైలట్ శిక్షణ కోసం డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. హైజిల్ కూడా అదే చేశాడు. కానీ అందుకు అతడించుకున్న మార్గం అంత ఈజీ కాదు. జొమాటో డెలివరీ బాయ్ గా పని చేశాడు. గణితం టీచర్ గా పాఠాలు చెప్పాడు.. డ్రైవర్ గా కూడా పనిచేశాడు..
కానీ, ఒకసారి ఊహించుకోండి
అతని మనసులో విమానాన్ని నడపాలి అనే కోరిక ఉంది. దాన్ని నిజం చేసుకోవడానికి ప్రతిరోజు కష్టపడి పని చేయాలి. సంపాదించిన ప్రతి పైసలు జాగ్రత్తగా వినియోగించుకోవాలి. లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సమయాన్ని.. అవకాశాలను వెతుక్కోవాలి. అతడు చేసిన పనులు ఎటువంటివైనా సరే.. లక్ష్యం మాత్రం ఒకటే.. తనకలను నిజం చేసుకోవడం.. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏ పని కూడా చిన్నది కాదు. నిజాయితీగా పనిచేసే మన భవిష్యత్తు కోసం ప్రయత్నించడం గౌరవించాల్సిన విషయం. డెలివరీ చేయడం కావచ్చు.. పిల్లలకు పాఠాలు చెప్పడం కావచ్చు.. డ్రైవింగ్ చేయడం కావచ్చు.. ఏ పని చేసిన మన లక్ష్యానికి ఒక మెట్టుగా అది మారితే ఆ పనికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది.. హైజిల్ తన కల కోసం ఎదురు చూడలేదు. ఆ కలను చేరుకోవడానికి అవసరమైన దారిలో నడవడం మొదలుపెట్టాడు..
ఒకరోజు కష్టపడితే విజయం వస్తుందని ఎవరూ చెప్పలేరు. కొన్ని లక్ష్యాల కోసం నెలలు.. సంవత్సరాలు ఎదురు చూడాల్సి ఉంటుంది మరికొన్ని లక్ష్యాల కోసం జీవితంలో విలువైన కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది.
జేబీ ప్రయాణం కూడా అటువంటిదే.. ఆర్థిక సమస్యలు.. కుటుంబంలో విషాదం.. చదువులు ఎదురైన అడ్డంకులు.. వీటన్నింటి మధ్య తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అతడు సుమారు 10 ఏళ్లపాటు పోరాడాడు. చివరికి ఫిలిప్పీన్స్ లో పైలట్ శిక్షణ పూర్తి చేశాడు. ఇది అతడు జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయి. ఒకప్పుడు బీటెక్లో బ్యాక్లాగ్స్ తో ఇబ్బందిపడిన యువకుడు.. ఆర్థిక సమస్యలతో ఎన్నో పనులు చేసిన వ్యక్తి.. ఇప్పుడు తన కళకు అవసరమైన పైలట్ శిక్షణ పూర్తి చేశాడు. అయితే ఇక్కడే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. పైలట్ శిక్షణ పూర్తి చేయడం.. కమర్షియల్ ఫ్లైట్లో ఉద్యోగ సంపాదించడం రెండూ ఒకటి కావు. సంబంధిత లైసెన్సులు.. అర్హతలు.. ఇతర అవసరమైన ప్రక్రియలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్ని సమస్యలను అధిగమించి ఈ దశకు చేరుకోవడమంటే మాటలు కాదు.
హైజిల్ కథ మనకు అనేకం నేర్పిస్తుంది.. ముందుగా వైఫల్యం అనేది అంతిమం కాదు. ఎందుకంటే బీటెక్లో బ్యాక్లాగ్స్ వచ్చాయని జీవితంలో విజయం సాధించలేమని అనుకోవడం పొరపాటు. మన బలహీనతలను గుర్తించి.. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి.
మన లక్ష్యం కోసం నిజాయితీగా పని చేయడం ఎప్పుడూ తక్కువ కాదు. ఇతరులు మనల్ని ఎలా చూస్తారు అనే దానికంటే.. మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నామన్నది ముఖ్యం..
ఆర్థిక ఇబ్బందులు నిజమైన సమస్యలే.. వాటిని తక్కువ చేసి చూడలేం. అయితే సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తూ.. అవసరమైన సహాయం పొందుతూ ముందుకు సాగడం కూడా అంతే ముఖ్యం.
అందరూ ఒకే వయసులో ఒకే స్థాయికి చేరుకోలేరు. కొందరికి అవకాశాలు త్వరగా వస్తాయి. మరికొందరు ఎన్నో సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. ఆలస్యమైందని మాత్రమే కలను వదులుకోవాల్సిన అవసరం లేదు.
కల ఉండడం ముఖ్యం. కలను చేరుకోవడానికి కావలసిన అర్హతలు, డబ్బు, శిక్షణ, సమయం వంటి అంశాలపై ప్రణాళిక రూపొందించుకోవడం కూడా అంతే ముఖ్యం.
మనలో చాలామందికి ఒక కల ఉంటుంది.. కొన్నిసార్లు రకరకాల ఇబ్బందులు దాన్నుంచి వెనక్కి లాగుతాయి. ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారుతాయి. చదువులో వైఫల్యాలు ఎదురవుతాయి. మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని తక్కువగా అంచనా వేస్తారు.. అప్పుడు మనం రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఒకటి పరిస్థితులను చూసి మన కలను వదులుకోవడం.. రెండవది మన పరిస్థితులకు అనుగుణంగా మార్గాన్ని మార్చుకుంటూ.. లక్ష్యాన్ని మాత్రం సజీవంగా ఉంచుకోవడం.. హైజిల్ జె బి ప్రయాణం రెండవ మార్గానికి ఒక ఉదాహరణ.. జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేసిన రోజులు అందరికి జీవితానికి ముగింపు కాలేదు. 20 బ్యాక్లాగ్స్ అతడి భవిష్యత్తుకు తుది తీర్పు ఇవ్వలేదు. ఆర్థిక ఇబ్బందులు అతనికలకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. అతడు తనకు సులభమైన వ్యవహారాలు సాగిస్తూ ముందుకు సాగాడు. చివరకు పైలట్ శిక్షణ పూర్తి చేశాడు. జేబీ గదిలో గొప్ప విషయం కేవలం పైలెట్ కావాలనే కల మాత్రమే కాదు. ఆకలను వదులుకోకుండా పరిస్థితులకు అనుగుణంగా పోరాటం కొనసాగించడం. గుర్తుంచుకోండి మన ప్రయాణం ఎంత నెమ్మదిగా సాగుతోంది అనేది ముఖ్యం కాదు. మనం లక్షణం వైపు అడుగులు వేస్తున్నామా లేదా అనేది ముఖ్యం.