HomeతెలంగాణTelangana Municipal Elections Results: బీఆర్‌ఎస్‌ రెండు.. కాంగ్రెస్‌ ఆరు మున్సిపాలిటీల్లో గెలుపు..

Telangana Municipal Elections Results: బీఆర్‌ఎస్‌ రెండు.. కాంగ్రెస్‌ ఆరు మున్సిపాలిటీల్లో గెలుపు..

Telangana Municipal Elections Results: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ దూకుడు కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో హస్తం హవా కొనసాగుతోంది. తాజా ఫలితాల ప్రకారం బీఆర్‌ఎస్‌ గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, అధికార కాంగ్రెస్‌ నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు, కోహిర్, మరిపెడ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. నల్గొండ జిల్లాలో దూకుడు.. నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్‌ దూకుడు కనిపిస్తోంది. నందికొండ మున్సిపాలిటీలో 12 స్థానాలు ఉండగా, 11 […]

Telangana Municipal Elections Results: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ దూకుడు కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో హస్తం హవా కొనసాగుతోంది. తాజా ఫలితాల ప్రకారం బీఆర్‌ఎస్‌ గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, అధికార కాంగ్రెస్‌ నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు, కోహిర్, మరిపెడ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.

నల్గొండ జిల్లాలో దూకుడు..
నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్‌ దూకుడు కనిపిస్తోంది. నందికొండ మున్సిపాలిటీలో 12 స్థానాలు ఉండగా, 11 కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ 1 గెలిచాయి. చండూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్‌ గెలిచింది. చిట్యాలలో హాలియాలో 12 సీట్లకు కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ 3, మరిపెడ, చండూరులో కాంగ్రెస్‌ గెలిచింది. చండూరులో 10 స్థానాల్లో కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 3, సీపీఐ 1 స్థానం సాధించాయి.

ఖమ్మంలో హస్తం హవా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. మధిర, వైరా, అశ్వారావుపేట, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం కొనసాగుతోంది. మధిరలో మెజారిటీ స్థానాల్లో గెలిచింది. ఇక ఖమ్మం కార్పొరేషన్‌లో కూడా కాంగ్రెస్‌ దూకుడు కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ కూడా కాంగ్రెస్‌ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper