Funky Movie Plus And Minus Points: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అనుదీప్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన కామెడీ టైమింగ్ కి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆయన ఏ షో కి వచ్చిన ఆయనలోని కామెడీ యాంగిల్ అనేది ఎలివేట్ అవుతుంటుంది. ప్రస్తుతం ఆయన విశ్వక్ సేన్ తో చేసిన ఫంకీ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆయనలోని కామెడీ చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులందరిని నవ్వించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వన్ లైనర్స్ తో ఆయన చాలావరకు ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అనుదీప్ చేసిన ఫంకీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మొత్తానికైతే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ప్లస్ పాయింట్స్
సినిమా ఫస్టాఫ్ లో వచ్చే వన్ లైన్ కామెడీ చాలా నీట్ గా ఉంది. ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా చాలా పద్ధతిగా కామెడీ పండించాడు. దాంతో ప్రేక్షకులందరు ఈ సినిమాలోని కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు… విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ కూడా బావుంది. అనుదీప్ రాసిన పంచ్ డైలాగులు చాలా ఎక్స్ట్రాడినరీగా పేలాయి. మ్యూజిక్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది… హీరోయిన్ సైతం తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించింది.
మైనస్ పాయింట్స్
సినిమా మొత్తం కామెడీ పంచులతో నిండిపోవడంతో ఒక స్టేజికి వచ్చిన తర్వాత ఏంటి ఈ కామెడీ అనే చిరాకు పుడుతుంది. సినిమాలో కథ పెద్దగా లేకపోవడంతో కేవలం కామెడీ మీదనే ఫోకస్ చేసి దర్శకుడు ఈ సినిమాని చేశాడు…
ఇక ఇలాంటి వన్ లైనర్ కామెడీ సిల్లీ కామెడీ ఒకటి రెండు సార్లు చూడ బుద్ధి అవుతుంది. కానీ సినిమా మొత్తం బ్యాక్ టు బ్యాక్ అవే కామెడీ పంచులు ఉండడం వల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది…నిజానికి ఈ సినిమాకి ఏ కామెడీ అయితే ప్లస్ అయిందో అదే కొన్ని సందర్భాల్లో మైనస్ అయింది…