Chirala Municipal Election Results: ఇప్పటివరకు మునిసిపల్ ఎన్నికల్లో.. అంతగా ఉత్కంఠకు గురిచేసిన ఫలితాలు పెద్దగా రాలేదు. కూటమికి అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి. కూటమి అంచనా వేసిన దాని కంటే స్థానాలు ఎక్కువగా రావడంతో.. ప్రజలు కూటమి పరిపాలన మీద సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మొన్న జరిగిన లెక్కింపు ప్రక్రియలో కొన్ని స్థానాలు ఆ జాబితాలో చేరలేదు. అయితే శుక్రవారం ఆ స్థానాలకు లెక్కింపు జరిగింది. అందులో బాపట్ల జిల్లాలోని చీరాల మున్సిపాలిటీ ముఖ్యమైనది.
ఈ మున్సిపాలిటీలో లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి సాగింది. అయితే ఇక్కడ ఇండియా కూటమి అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. ఓట్ల లెక్కింపు సమయంలో టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి.. తన సమీప ప్రత్యర్థి మీద ఏకంగా 6468 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
పురపాలక చైర్ పర్సన్ స్థానానికి ఇక్కడ ప్రత్యక్ష పద్ధతిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు టిడిపి అభ్యర్థికి ఏకంగా 21 883 ఓట్లు వచ్చాయి. ప్రధాన ప్రత్యతిగా నిలిచిన వైసిపి అభ్యర్థికి 15,415 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి 11,025 ఓట్లు సాధించారు. వైసిపి.. కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఓట్లను చీల్చుకున్నప్పటికీ.. కూటమి ఓటు బ్యాంకు పటిష్టంగా కనిపించింది. టిడిపికి తిరుగులేని స్థాయిలో లీడ్ తీసుకొచ్చింది. ప్రభుత్వం మార్చేస్తున్న సంక్షేమం.. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆముదముద్ర వేశారు.
కౌన్సిలర్ స్థానాల ఫలితాల్లో కూడా కూటమి తిరుగులేని స్థాయిని చూపించింది. మున్సిపల్ కౌన్సిల్ మొత్తాన్ని ఊడ్చి పడేసింది. మొత్తం వార్డులలో ఎన్డీఏ కూటమి ఏకంగా 25 స్థానాలను దక్కించుకుంది. ఇందులో టిడిపి ఒంటరిగానే 22 వార్డులను దక్కించుకుంది. మిత్రపక్షాలైన జనసేన రెండు.. బిజెపి ఒక వార్డులో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ స్థానికంగా పోటీ ఇచ్చింది. పది స్థానాలు దక్కించుకొని రెండవ అతిపెద్ద శక్తిగా ఆవిర్భవించింది. ఇందులో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయాన్ని అందుకున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు చీరాల పురపాల కాలనీ వైసీపీ శాసించింది. అయితే కేవలం 8 వార్డులు మాత్రమే గెలిచి.. వైసిపి మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాన్ని గెలుచుకోవడం ఆ పార్టీ కార్యవర్గాన్ని తీవ్రస్థాయిలో నిరాశకు గురిచేస్తుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చీరాల మున్సిపాలిటీలో కూటమికి తిరుగులేని విజయాన్ని అందించారు. మునిసిపల్ స్థానం మాత్రమే కాదు.. అత్యధిక వార్డులలో టిడిపి జెండా రెపరెపలాడింది ఈ నేపథ్యంలో నాయకులు గట్టిగానే సంబరాలు చేసుకున్నారు.