HomeతెలంగాణHYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ. అయితే హైడ్రా ప్రకృతి విపత్తుల సహాయం మరిచి ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిపై దూకుడు పెంచింది. చెరువులు, కుంటల సంరక్షణ పేరుతో దశాబ్దాలుగా శిఖం భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నవారిని నిరాశ్రయులను చేసింది. తాజాగా ఆర్మీ భూముల్లోకి కూడా హైడ్రా […]

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ. అయితే హైడ్రా ప్రకృతి విపత్తుల సహాయం మరిచి ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిపై దూకుడు పెంచింది. చెరువులు, కుంటల సంరక్షణ పేరుతో దశాబ్దాలుగా శిఖం భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నవారిని నిరాశ్రయులను చేసింది. తాజాగా ఆర్మీ భూముల్లోకి కూడా హైడ్రా ఎంటర్‌ అయింది. హైడ్రా చీఫ్‌గా ఉన్న రంగనాథ్‌ తీరుపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను కూడా రంగనాథ్‌ లెక్కచేయకుండా కూల్చివేతలు చేపట్టారు. ఆదివారం కూల్చివేతలు చేయొద్దన్న ఆదేశాలనూ ఉల్లంఘించారు. ఇలా అనేక కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన రంగనాథ్‌పై చివరకు హైకోర్టు కొరడా ఝళిపించింది.

లోతుకుంట భూముల అంశంపై విచారణ..
హైదరాబాద్‌లోని ఆర్మీ పరిధిలోకి వచ్చే లోతుకుంట భూముల అంశంపై హైడ్రా జోక్యం విమర్శలకు దారితీసింది. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం(జూలై 27న) విచారణ జరిపింది. హైడ్రా తీరును తప్పు పట్టింది. హైడ్రా కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ క్షమాపణలు చెబుతూ అఫిడవిట్‌ సమర్పించారు. అందులో సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల ప్రాంతంలోకి సంస్థ ప్రవేశించలేదని, పిటిషనర్‌ తప్పుడు వాదనలు వినిపించారని పేర్కొన్నారు.

ధిక్కారంపై ఆగ్రహం..
రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కార కేసులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టులపై విశ్వాసముందని ఆయన చెప్పినా, ఇన్ని కేసులు ఎలా నమోదయ్యాయని ప్రశ్నించింది. ఆదేశాలను పాటించకపోవడంపై అసహనం చెందుతూ, ఎన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

పదవి నుంచి తొలగింపు
ధిక్కారానికి పాల్పడినందుకు ఐపీఎస్‌ ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌ బాధ్యతల నుంచి వెంటనే తొలగించాలని తెలంగాణ చీఫ్‌ సెక్రటరీకి హైకోర్టు స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. అలాగే ఐజీ స్థాయి అధికారిని కొత్తగా నియమించాలని కూడా సూచించింది.

దాదాపు రెండేళ్లుగా రాజాధానిలో వేల మంది హైడ్రా బాధితులు ఉన్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా బాధితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రియల్టర్లు అయితే సంబురాలు చేసుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper