Homeహెల్త్‌Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం తగ్గించడం, ఎక్కువసేపు నడవడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక కిలో బరువు శరీరం కొవ్వు తగ్గాలంటే సుమారు 7,700 క్యాలరీల లోటు అవసరం అనే లెక్క తరచుగా వినిపిస్తుంది. అయితే ఇది అందరికీ ఒకే విధంగా వర్తించే ఖచ్చితమైన సూత్రం కాదని […]

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం తగ్గించడం, ఎక్కువసేపు నడవడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక కిలో బరువు శరీరం కొవ్వు తగ్గాలంటే సుమారు 7,700 క్యాలరీల లోటు అవసరం అనే లెక్క తరచుగా వినిపిస్తుంది. అయితే ఇది అందరికీ ఒకే విధంగా వర్తించే ఖచ్చితమైన సూత్రం కాదని నిపుణులు చెప్తున్నారు. శరీర బరువు వయసును బట్టి నిర్ణయం చేసుకోవచ్చు. అసలు ఒక కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎంతసేపు నడవాలి?

సాధారణంగా ఒక కిలో శరీర కొవ్వులో సుమారు 7,700 క్యాలరీల శక్తి ఉంటుందని అంచనా వేస్తారు. అందువల్ల ఒక వ్యక్తి తీసుకునే ఆహారం ద్వారా లభించే క్యాలరీల కంటె శరీరం ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పుడు ‘క్యాలరీ డెఫిసిట్’ ఏర్పడుతుంది. ఉదాహరణకు రోజుకు 500 క్యాలరీల లోటు ఉంటే వారానికి దాదాపు 3.5 క్యాలరీల లోటు ఏర్పడుతుంది. దీని ప్రకారం వారానికి సుమారు 0.4 నుంచి 0.5 కిలోల బరువు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు అయితే వాస్తవ బరువు తగ్గటంలో నీటి బరువు గ్లైకోజెన్ కండరాల మార్పులు కూడా ప్రభావం చూపుతాయి.

వారంలో ఒక కిలో తగ్గాలంటే 7,700 క్యాలరీల లోటును ఏడు రోజుల్లో సాధించాల్సి ఉంటుంది. అంటే సగటున రోజుకు సుమారు 1100 క్యాలరీల లోటు అవసరమవుతుంది. పూర్తిగా వ్యాయామం ద్వారా సాధించడానికి ప్రయత్నించడం చాలా మందికి కష్టమే. అందుకే ఆహారంలో నియంత్రణతో పాటు శరీరక శ్రమను కలిపి చేయడం సాధారణంగా మెరుగైన విధానంగా పరిగణిస్తారు.

సాధారణంగా వెయ్యి అడుగులు నడిస్తే సుమారు 40 నుంచి 50 కేలరీలు ఖర్చవుతాయని కొందరు అంటుంటారు. కానీ ఒక వ్యక్తి బరువు, నడకను బట్టి మాత్రమే అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి రోజుకు 1100 కేలరీలు నడక ద్వారా ఖర్చు చేయాలని అనుకుంటే 22 వేల వరకు అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే దీనిని కచ్చితంగా చెప్పలేం. కానీ సాధ్యమైనంత వరకు ఆరోగ్య పరిరక్షణ ను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేయాల్సి ఉంటుంది.

కేవలం అడుగుల ద్వారా మాత్రమే కాకుండా ఆహారాన్ని మార్చడంలో కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అధికంగా ఆయిల్ ఉండే పదార్థాలతోపాటు డీప్ ఫ్రై చేసిన పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం ప్రతిరోజు కనీసం 10 అడుగులు వేయాలని అంటున్నారు. అయితే ఇంతవరకు లక్ష్యాన్ని నిర్వహించుకుంటే మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper