Homeటాప్ స్టోరీస్Telangana Congress : అస్తమానం తిడితే పడడు.. రేవంత్ రెడ్డి లోనూ ఓ కెసిఆర్ ఉన్నాడు.....

Telangana Congress : అస్తమానం తిడితే పడడు.. రేవంత్ రెడ్డి లోనూ ఓ కెసిఆర్ ఉన్నాడు.. పాపం కొండా సురేఖ

Telangana Congress : నిజమే తిడితే పడుతుంటాడు.. విమర్శిస్తే ఓర్చుకుంటాడు. ఆరోపణలు చేస్తే తట్టుకుంటాడు.. రాజకీయ వర్గాలలో రేవంత్ రెడ్డి గురించి చర్చ జరిగినప్పుడు ఈ మాటలు తరచుగా వస్తూ ఉంటాయి. చివరికి పత్రికలలో పనిచేసే విలేకరులు అడిగే ప్రశ్నలకు కూడా రేవంత్ రెడ్డి సమాధానం చెబుతూ ఉంటారు. అక్కడిదాకా ఎందుకు టీ న్యూస్, నమస్తే తెలంగాణలో పనిచేసే వారికి కూడా రెస్పెక్ట్ ఇస్తుంటాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన […]

Telangana Congress : నిజమే తిడితే పడుతుంటాడు.. విమర్శిస్తే ఓర్చుకుంటాడు. ఆరోపణలు చేస్తే తట్టుకుంటాడు.. రాజకీయ వర్గాలలో రేవంత్ రెడ్డి గురించి చర్చ జరిగినప్పుడు ఈ మాటలు తరచుగా వస్తూ ఉంటాయి. చివరికి పత్రికలలో పనిచేసే విలేకరులు అడిగే ప్రశ్నలకు కూడా రేవంత్ రెడ్డి సమాధానం చెబుతూ ఉంటారు. అక్కడిదాకా ఎందుకు టీ న్యూస్, నమస్తే తెలంగాణలో పనిచేసే వారికి కూడా రెస్పెక్ట్ ఇస్తుంటాడు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన తన వాగ్దాటితోనే ఇక్కడ దాకా వచ్చారు. టిడిపి నుంచి కాంగ్రెస్ కు.. టిడిపిలోకి రావడానికి అంటే ముందు భారత రాష్ట్ర సమితిలోకి.. అంతకుముందు ఆర్ఎస్ఎస్.. అనేక రకాల నేపథ్యాల నుంచి చాలా నేర్చుకున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా వరకు మారిపోయారు. హుందాతనాన్ని మరింత పెంచుకున్నారు. ఒకరకంగా విమర్శలకు అప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వడం కంటే.. సమయం దొరికినప్పుడే మాట్లాడడం మొదలుపెట్టారు. స్థితప్రజ్ఞతను అలవాటు చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తనను అకారణంగా దూషించిన వారిని.. అడ్డగోలుగా మాట్లాడిన వారిని వదిలిపెట్టి రకం కాదు రేవంత్ రెడ్డి. ఒకరకంగా చెప్పాలంటే తనలో కూడా ఒక కేసీఆర్ ఉన్నారు.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజయ్యను.. రాజేందర్ ను మంత్రి పదవుల నుంచి తొలగించారు. సొంత మీడియాలో వారిద్దరిమీద వ్యతిరేక కథనాలు రాయించారు. కెసిఆర్ కు కోపం వస్తే ఎలా ఉంటుందో నిరూపించారు. గతంలో కొండా సురేఖ.. ఇంకా అనేకమందికి టికెట్లు దక్కలేదు. వారిపై తనకున్న కోపాన్ని రాజకీయంగానే చూపించారు కేసీఆర్. అంతేకాదు వారి వ్యాపారాలను.. ఇతర వ్యవహారాలను కూడా దెబ్బ కొట్టారు.

ఇప్పుడు కొండా సురేఖ విషయంలో కూడా రేవంత్ రెడ్డి అదే పాలసీని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే పరకాల సభలో రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారో.. అప్పుడే కొండా సురేఖ కుమార్తె తెరమీదికి వచ్చారు. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికి ఎక్కాయి అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత గులాబీ పార్టీ మీడియా మొదలుపెట్టింది. కాంగ్రెస్ పని అయిపోయింది. రేవంత్ రెడ్డి పదవి కూడా ఓడిపోతుందని ప్రచారం చేయడం ప్రారంభించింది. సహజంగానే రేవంత్ రెడ్డి దూకుడు గల రాజకీయ నాయకుడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి ఇక్కడ దాకా తీసుకొస్తే.. కనీసం సభ్యత్వం లేని వారు కూడా తన మీద విమర్శలు చేయడం ఏంటని ఆయనలో అంతర్మదనం మొదలైంది. ఏకకాలంలో చిన్నారెడ్డికి.. కొండా సురేఖకు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సమాధానం చెప్పాలని అనుకున్నారు. అన్నట్టుగానే చెప్పడం మొదలుపెట్టారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొండా సురేఖ ఏరి కోరి తెచ్చుకున్న అధికారులను మాతృ స్థానాలకు పంపించారు. ఇప్పుడు ఏకంగా కొండా సురేఖ ను పదవి నుంచి తప్పించబోతున్నారు. రేవంత్ రెడ్డి నిదానాన్ని.. స్థితప్రజ్ఞతను చూపిస్తారు. తిక్క రేగితే తనలో ఉన్న కేసీఆర్ ను బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు జరిగింది కూడా అదే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper