Andhra Pradesh Tragedy : ఏపీ రాష్ట్రంలో వరుసగా సామూహిక ఆత్మహత్యల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక ఘటన మర్చిపోకముందే మరొక ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గోదావరి నదిలో దూకి చనిపోయారు. ఈ సంఘటన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీని వెనక వేరే వేరే వ్యవహారాలు ఉండడంతో కలకలం పెరుగుతోంది.
ఇటీవల రాజమండ్రిలో ఏఈ నూకరాజు.. ఆయన భార్య మీన.. కూతురు సౌజన్య గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరు అలా చనిపోవడం వెనక సాదిక్ అనే వ్యక్తి ఉన్నాడని తెలుస్తోంది. అతడు సౌజన్యకు దగ్గర కావడం.. ఆమె భర్తను చంపడం.. ఆ తర్వాత సౌజన్య మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో.. ఆమె సామూహికంగా తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంబంధించి పోలీసులు అనేక వివరాలు సేకరించారు. లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ఘటన మర్చిపోకముందే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో వడ్డెర సత్రంలోని రూమ్ నెంబర్ 11 లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. వీరిలో ఇద్దరు గదిలో ఉన్న హాలులో ఫ్యానుకు ఉరివేసుకున్నారు. ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే మూడు రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. కాకపోతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సత్రంలో ఉన్న గది నుంచి దుర్వాసన వస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు పరిశీలించారు. అందులో మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
చనిపోయిన వారు సత్యసాయి జిల్లా బత్తులపల్లి చెందిన పల్లపు సుధాకర్.. మల్లీశ్వరి.. శ్రీదేవి.. గోగుల ఆదిలక్ష్మి.. మణికంఠ అని పోలీసులు గుర్తించారు. ఆర్థికపరమైన ఇబ్బందులే వీరు చనిపోవడానికి కారణం అని తెలుస్తోంది. సుధాకర్ గత నెల 28న తన ముగ్గురు తోబుట్టువులు.. మేనల్లుడు తో కలిసి శ్రీశైలం వచ్చాడు. ప్రతిరోజు 800 రూపాయల రెంట్ చెల్లిస్తూ వడ్డెర సత్రం గదిలో వారు ఉన్నారు. వాస్తవానికి అన్ని రోజులు సత్రం గదిలో ఉండకూడదని ఆలయ నిర్వాహకులు చెప్పినప్పటికీ.. తమకు ఆరోగ్యం బాగోలేదని సాకులు చెప్పారు. సుధాకర్.. ఆయన సోదరీమణులు.. మేనల్లుడు ఉరివేసుకొని చనిపోయారు. సుధాకర్ కు 36 సంవత్సరాలు ఉంటాయి. ఇంతవరకు వివాహం కాలేదు.. తన సోదరీమణులకు అతడు వివాహం చేశాడు. కుటుంబ కలహాల వద్ద వారు భర్తలను వదిలేసి ఇంటి వద్ద ఉంటున్నారు. దీనికి ఆర్థిక ఇబ్బందులు కూడా తోడు కావడంతో.. వారు ఈ దారుణానికి పాల్పడ్డారు.
శ్రీశైలంలో వసతి గదిలలో భక్తులు ఉండడానికి కేవలం 48 గంటలు అనుమతి ఉంటుంది. అయితే ఇక్కడి సత్రం నిర్వాహకులు నిబంధనలు మొత్తం ఉల్లంఘించారు. సుధాకర్ కుటుంబానికి గదులు కేటాయించారు. ప్రైవేటు సత్రాలు మొత్తం నిబంధనల ప్రకారం భక్తులకు గదులు కేటాయించారు. ఇక వడ్డెర సత్రం నిర్వహణ ఇక్కడ ప్రతిసారి వివాదాస్పదంగానే ఉంటుంది. గతంలో ఇక్కడ దేవస్థానం అధికారులు తనిఖీలు నిర్వహించి సత్రాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులు హైకోర్టు దాకా వెళ్లి.. అనుమతులు తెచ్చుకున్నారు.