Homeటాప్ స్టోరీస్Revanth Reddy: కరువు కాలంలో రేవంత్ ఢిల్లీ బాట.. తెలంగాణ ప్రజలు అంటే ఇంత చులకనా..

Revanth Reddy: కరువు కాలంలో రేవంత్ ఢిల్లీ బాట.. తెలంగాణ ప్రజలు అంటే ఇంత చులకనా..

Revanth Reddy: భారత రాష్ట్ర సమితి చెప్పినట్టుగానే.. ఆరోపించినట్టుగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారేమో అనిపిస్తుంది. పదేపదే అవే తప్పులు.. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ ప్రచారం చేసినప్పటికీ.. సొంత మీడియాలో రకరకాల భాష్యాలు చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవడం లేదు. పైగా గులాబీ పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా నడుచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రంలో తెలంగాణ అత్యంత కీలకమైనది. ఇక్కడ మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజలు మెచ్చుకునే విధంగా […]

Revanth Reddy: భారత రాష్ట్ర సమితి చెప్పినట్టుగానే.. ఆరోపించినట్టుగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారేమో అనిపిస్తుంది. పదేపదే అవే తప్పులు.. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ ప్రచారం చేసినప్పటికీ.. సొంత మీడియాలో రకరకాల భాష్యాలు చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవడం లేదు. పైగా గులాబీ పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా నడుచుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రంలో తెలంగాణ అత్యంత కీలకమైనది. ఇక్కడ మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజలు మెచ్చుకునే విధంగా పనులు చేయాలి. గులాబీ పార్టీని అన్ని విధాలుగా కార్నర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ అధికంగా ఉంటుంది. సెంటిమెంట్ లోబడి రాజకీయాలు చేయాలి. అదే సమయంలో ప్రజల సంక్షేమాన్ని.. అభివృద్ధిని కొనసాగిస్తూ ఉండాలి. కానీ ఈ విషయంలో ఇటీవల కాలంలో సీఎం వేగవంతంగా చర్యలు తీసుకోనట్టు కనిపిస్తోంది.

మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి విమర్శలకు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన కౌంటర్ రాలేదు. మేడిగడ్డ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రిపేర్ ఇప్పుడు సాధ్యమవుతుందా.. ఇంకెన్ని రోజులు పడుతుంది అనే విషయం మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. ఇక విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండడంతో.. దానికి తగ్గట్టుగా సరఫరా కూడా ఉండడం లేదు. దేశం మొత్తం కరువు ఉంది. కాదనలేని వాస్తవం. కానీ కరువు తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి కూడా చర్యలు ఉండాలి కదా.. ఆ విషయంలో సీఎం విఫలం అని చెప్పవచ్చు. ఇటీవల సోమవారం కరువు మీద సమీక్ష నిర్వహిస్తామని సీఎంఓ ఆఫీస్ నుంచి మీడియాకు సమాచారం అందించారు. కానీ ఆ సమాచారానికి సీఎంతో సహా మంత్రులు మొత్తం డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో ముఖ్యమంత్రి నుంచి మొదలుపెడితే ఎమ్మెల్యేల వరకు అందరూ ఢిల్లీ బాట పట్టారు. అక్కడ జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు.

కరువు మీద సమీక్ష నిర్వహిస్తామని చెప్పి.. అప్పటికప్పుడు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు ఢిల్లీ బాట పడితే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి.. ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణను ఇలా అన్యాయం చేస్తారా.. అటు గులాబీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. సొంత మీడియాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కరువు పరిస్థితులను ఏ కరువు పెడుతున్నారు. ఆంధ్ర ప్రాంతం నాయకులు తెలంగాణ నుంచి నీళ్లను దోచుకుని పోయారని.. కనీసం మేడిగడ్డ నుంచి నీళ్లను ఎత్తిపోసే సోయి ప్రభుత్వానికి లేదని.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకుల వద్ద సమాధానం లేదు. అప్పటికప్పుడు సమావేశం పెట్టి.. ఆ తర్వాత సమావేశాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించడం నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఢిల్లీ రాజకీయాలకు నిదర్శనమని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులకు ఏ స్థాయి విలువ ఉంటుందో ఇటీవల డీకే శివకుమార్ ఉదంతం నిరూపించింది. తెలంగాణ నుంచి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దగా అక్కడ గౌరవం లభించలేదని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి.. ఢిల్లీలో అధిష్టానం సేవ చేయడానికి నాయకులు వెళ్లిన తీరును చూస్తే అసహ్యం వేస్తోందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి సమాధానం చెప్తారు.. కరువును ఎలా ఎదుర్కొంటారు.. అనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper