KTR: గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల కాలంలో పదేపదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగుడుతున్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ చంద్రబాబు నాయకత్వాన్ని మరోసారి ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని.. ఏపీ రాష్ట్రంలో కూడా ఇలానే ఉన్నప్పటికీ.. చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పరిపాలిస్తున్న నేపథ్యంలో.. ఏపీలో కరువు అనేది కనిపించడం లేదని.. ప్రతికూల పరిస్థితులనూ తనకు అనుకూలంగా మార్చుకున్నారని.. అది చంద్రబాబు నాయకత్వానికి నిదర్శనం అని కేటీఆర్ అంటున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరువు ఉందని.. కానీ తెలంగాణలో దాని తీవ్రత అధికంగా కనిపిస్తోందని.. దీనంతటికీ ప్రధాన కారణం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
నీటిని సమర్థవంతంగా వాడుకోవడంలో చంద్రబాబు చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నారని.. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారని.. ఏపీ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ.. నీటి నిల్వ.. నిర్వహణ విషయంలో చంద్రబాబు సమర్థత ప్రదర్శిస్తున్నారని.. రైతులను.. ప్రజలను ఆదుకుంటున్నారని కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల.. ప్రణాళికలు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం అవసరం లేదని.. కమిషన్ ఇస్తే సరిపోతుందని కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ పనితీరు మీద రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు బలమైన నిదర్శనమని కేటీఆర్ అన్నారు.
కొండ సురేఖ తనకు క్షమాపణ చెప్పిన తీరుని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. నిజం నిలకడగా ఉంటుందని.. మొన్న ఒక పత్రిక.. ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని వివరించారు. ఆమె ఇచ్చిన వివరణ చూడలేదని.. లేఖను పరిశీలించిన తర్వాత.. తమ న్యాయ బృందంతో చర్చించి.. తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. రాజకీయంగా కక్ష సాధింపు చేసేందుకు.. తమపై అసత్యాలు ప్రచార చేసిన ప్రతి ఒక్కరు.. పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పక తప్పదని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ మీద ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేసు నమోదు చేసింది. దీనిపై కూడా కేటీఆర్ స్పందించారు. త్వరలోనే రేవంత్ బోనులో నిలబడక తప్పదని హెచ్చరించారు. పరిపాలన చేయడం చేతగాక ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ.. రేవంత్ కాలం గడుపుతున్నారని.. కరువులోన రైతులను ఆదుకోవడంలో రేవంత్ విఫలమయ్యారని.. ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకోవాల్సిన విధానాలను ఒంట పట్టించుకోవాలని సూచించారు. గతంలో చంద్రబాబును కేటీఆర్ విమర్శించారు. కెసిఆర్ కూడా విమర్శించారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకొని చంద్రబాబు పరిపాలనను కొనియాడుతున్నారు. కేటీఆర్ విషయంలో సురేఖ కైతే ఏ విధంగా జ్ఞానోదయం కలిగిందో.. చంద్రబాబు విషయంలో కూడా కేటీఆర్ కు అదే విధంగా జ్ఞానోదయం కలిగిందని టిడిపి నేతలు అంటున్నారు.
చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్న
– KTR https://t.co/bB1U4mMkTb
— (@Shiva4TDP) October 29, 2026