Vangaveeti Radha Krishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల వ్యవహారం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాలలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ఇలా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు. ఈ మార్పులతో వైసిపికి పెదగా ప్రయోజనం జరిగే అవకాశం లేదు. కాకపోతే అంతిమంగా కూటమిలో జనసేన లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూటమి పొత్తుల నేపథ్యంలో విజయవాడ మేయర్ పీఠాన్ని జనసేన పార్టీ కేటాయించినట్లు తెలుస్తోంది. అన్ రిజర్వ్ డ్ జనరల్ కేటగిరి కింద ఈ స్థానం దక్కడంతో జనసేన నుంచి మేయర్ పీఠం కోసం వంగవీటి రాధాకృష్ణను అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం విజయవాడ రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేసింది.
వంగవీటి రాధాకృష్ణ కొంతకాలంగా టిడిపి తరఫున పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రచారం కూడా గట్టిగానే సాగింది. అయితే టిడిపి నుంచి చాలామంది నాయకులు లైన్లో ఉండడంతో.. టిడిపికి మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఎవరికి మేయర్ పీఠం ఇచ్చినా సరే ఇబ్బందికరంగా ఉండడంతో.. విజయవాడ స్థానాన్ని జనసేనకు ఇచ్చారు. దీంతో జనసేనతో అప్పటిదాకా చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చిన వంగవీటి రాధా.. నేరుగా జనసేనలో చేరిపోయి.. మేయర్ గా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారింది.
మొదట్లో రాధాకృష్ణ భార్య పేరు మేయర్ పీఠం కోసం వినిపించింది. అయితే ఇప్పుడు రాధాకృష్ణ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాధాకృష్ణ స్వయంగా సంకేతాలు ఇవ్వడంతో ఆయన అనుచరులు.. అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరిలోనే జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో రాధాకృష్ణ కండువా కప్పుకొని అధికారికంగా.. చేరబోతున్నారు. రాధా చేరిపోతే జనసేనకు విజయవాడలో మరింత బలం పెరుగుతుందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి కొంతకాలంగా జనసేన నుంచి గట్టి ప్రాతినిధ్యం లభించడం లేదు. రాధా వస్తే స్థానిక అభిమానులతో పాటు.. టిడిపి కార్యకర్తలు.. జనసేన కార్యకర్తలు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టిడిపి.. కూటమి సంయుక్తంగా స్థానిక సంస్థలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వంగవీటి రాధాకృష్ణ లాంటి బలమైన నాయకుడు జనసేన నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వాస్తవానికి రాధాకృష్ణ ఎప్పటినుంచో జనసేనలో చేరాలని అనుకుంటున్నారు. కాకపోతే సరైన సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విజయవాడ మేయర్ పీఠం దక్కే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా జనసేనలో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి కూడా సంకేతాలు రావడంతో.. రాధాకృష్ణ జనసేనలో చేరిపోవడం ఇక లాంచనమే. టిడిపి కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉండడంతో విజయవాడలో జనసేనకు మేయర్ పీఠం దగ్గర నల్లేరు మీద నడకే అని విశ్లేషకులు చెబుతున్నారు.