Homeటాప్ స్టోరీస్Revanth Reddy Konda Surekha : మీడియాకు మసాలా బాగానే అందించారు.. కొండా సురేఖ విషయంలోనే...

Revanth Reddy Konda Surekha : మీడియాకు మసాలా బాగానే అందించారు.. కొండా సురేఖ విషయంలోనే రేవంత్ సస్పెన్స్ థ్రిల్లర్..

Revanth Reddy Konda Surekha : మీడియా ఊహించిందే జరిగింది. మీడియా అంచనా వేసింది చోటు చేసుకుంది. కెసిఆర్ లెవెల్ లో రండ స్థాయి భాష ఉపయోగించకపోయినప్పటికీ.. కేటీఆర్ లెవెల్లో హౌలా అనే మాటలు మాట్లాడకపోయినప్పటికీ.. హరీష్ రావు స్థాయిలో బిడ్డ ఉరికించి కొడతామని హెచ్చరించకపోయినప్పటికీ.. మొత్తానికి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు. ప్రెస్మీట్లో ప్రారంభం నుంచి చివరిదాకా తన అమెరికా పర్యటన ఎందుకు.. లండన్ పర్యటన ఎందుకు.. ఎవరికి లేఖలు రాసింది.. ఎవరితో మాట్లాడింది.. […]

Revanth Reddy Konda Surekha : మీడియా ఊహించిందే జరిగింది. మీడియా అంచనా వేసింది చోటు చేసుకుంది. కెసిఆర్ లెవెల్ లో రండ స్థాయి భాష ఉపయోగించకపోయినప్పటికీ.. కేటీఆర్ లెవెల్లో హౌలా అనే మాటలు మాట్లాడకపోయినప్పటికీ.. హరీష్ రావు స్థాయిలో బిడ్డ ఉరికించి కొడతామని హెచ్చరించకపోయినప్పటికీ.. మొత్తానికి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు.

ప్రెస్మీట్లో ప్రారంభం నుంచి చివరిదాకా తన అమెరికా పర్యటన ఎందుకు.. లండన్ పర్యటన ఎందుకు.. ఎవరికి లేఖలు రాసింది.. ఎవరితో మాట్లాడింది.. ఎవరితో ఒప్పందాలు కుదుర్చుకుంది.. దీనివల్ల తెలంగాణకు జరిగే ప్రయోజనమేంటి.. ఇలా అన్ని విషయాలలో రేవంత్ చాలా స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఒక అంశం మీద ఎంత సుదీర్ఘంగా క్లారిటీ ఇచ్చిన సమావేశం లేదంటే అతిశయోక్తి కాదు. కేంద్రం మీద విధానపరంగా మాత్రమే ఆయన విమర్శలు చేశారు. ఒకటి రెండు సందర్భాలలో గుజరాత్ ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ.. విదేశాంగ శాఖతీరును విమర్శించినప్పటికీ.. తన హద్దుల్లోనే ఆయన మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రి కి అమెరికా పర్యటనకు ఇచ్చిన అవకాశాన్ని తనకు ఎందుకు ఇవ్వరని సరిగ్గా మోడీ స్టైల్ లోనే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చివరికి కేటీఆర్.. హరీష్ రావు.. కవిత పిల్లలు అమెరికాలో చదువుకుంటుంటే.. వారికి ఇచ్చిన అనుమతి తనకు ఎందుకు ఇవ్వరని రేవంత్ రెడ్డి.. బిజెపి.. బీఆర్ఎస్ బాయ్ బాయ్ అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగానే తీసుకెళ్లారు. ఒక రకంగా ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తారని మీడియా ఊహించలేదు. నరేంద్ర మోడీ గతంలో పాకిస్తాన్ ఎందుకు వెళ్లారు.. గులాబీ పార్టీ నేతలకు ఎందుకు అనుమతులు ఇస్తున్నారు.. వాళ్లు కోరగానే ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు అనేక విషయాలను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా రేవంత్ రెడ్డి చెప్పగలిగారు.

కొద్ది రోజులుగా తెలంగాణ మీడియాలో కొండా సురేఖ ఎపిసోడ్ గురించి మాత్రమే విపరీతంగా చర్చ జరుగుతుంది. ఒక సెక్షన్ మీడియా దారుణంగా రేవంత్ రెడ్డి మీద రాతలు రాస్తుంది. రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుందని స్పష్టం చేస్తోంది. అంతేకాదు మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పక్షం లేరని గట్టిగా చెబుతోంది. కానీ సోమవారం జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి వెంట ఉత్తంకుమార్ రెడ్డి నుంచి మొదలు పెడితే విక్రమార్క వరకు ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా రేవంత్ రెడ్డి చెబుతుంటే విన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఆధారాలతో సహా మీడియా ముందు అన్ని విషయాలను ఉంచారు. ఇక చివర్లో కొండా సురేఖ ఎపిసోడ్ గురించి కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో ఆయన ఎటువంటి దాచివేత ధోరణి ప్రదర్శించలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందని.. క్రమశిక్షణ కమిటీ కూడా ఉందని.. ఏం నిర్ణయం తీసుకోవాలో వారే తేల్చుకుంటారని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన ముఖ్యమంత్రిని అయినంత మాత్రాన తనకు కొమ్ములు ఉండవని.. పార్టీకి.. క్రమశిక్షణ కమిటీకి వీర విధేయుడు గానే ఉంటానని రేవంత్ స్పష్టం చేశారు. చివర్లో ఊహాజనిత కథనాలు రాయకూడదని మీడియాకు చురకలు అంటించారు. మీడియాకు కావలసిన మసాలా ఇచ్చిన రేవంత్.. చివర్లో షాక్ ఇచ్చి.. నోరు మూయించారు. ఏదో జరిగిపోతుందని.. ఇంకేదో అవుతుందని గులాబీ మీడియా కొద్ది రోజులుగా డప్పు కొట్టింది. సొంత మీడియాలో పిచ్చిపిచ్చిగా రాతలు రాసింది. చివరికి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ష్ గప్ చుప్ అయిపోయింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper