spot_img
HomeతెలంగాణCM Revanth Reddy: ఏం ప్లాన్ వేశాడు.. బీఆర్ఎస్ కత్తితోనే దాని గొంతుకోసిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఏం ప్లాన్ వేశాడు.. బీఆర్ఎస్ కత్తితోనే దాని గొంతుకోసిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ కొత్త అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే గత ప్రభుత్వంపై న్యాయవిచారణలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం, విద్యుత్‌ ఒప్పందాలపై బీఆర్‌ఎస్‌ నేతల కోరిక మేరకే విచారణలకు ఆదేశిస్తున్నామని రేవంత్‌ ప్రకటించేశారు. నిజంగానే బీఆర్‌ఎస్‌ నేతలు విచారణకు సవాల్‌ చేశారు. అదే అదనుగా విచారణ ప్రకటించేశారు రేంత్‌రెడ్డి. గడిచిన పదేండ్లలో విద్యుత్‌ వ్యవస్థల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఒప్పందాలు, ప్రభుత్వ పనితీరుపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు.

మూడు అంశాలపై..
గత ప్రభుత్వం విద్యుత్‌ సంస్థల నిర్వహణలో పదేళ్లలో జరిగిన అవకతవకలు, ఒప్పందాలను మూడు అంశాల ప్రాతిపదికగా ఈ విచారణ జరిపిస్తామన్నారు సీఎం రేవంత్‌. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్ల నిర్మాణాలు, ఒప్పందాలపై విచారణ జరుగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా తీరుతెన్నుల సమీక్ష కోసం అఖిలపక్షంతో నిజనిర్థారణ కమిటీ నియమిస్తామన్నారు. దీనికి కారణమం.. విచారణ చేయించుకోవాలని మాజీ విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ చేయడమే.

కాళేశ్వరంపైనా..
ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కుంగుబాటుపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న సమయంలో కవిత .. విచారణ చేసుకోవాలని సవాల్‌ చేశారు. కాళేశ్వరం వద్దకు సభ్యులను తీసుకెళ్తామని కూడా రేవంత్‌ ప్రకటించారు. దీనికి కవిత.. కాళేశ్వరం ఏమైనా టూరిస్టు ప్లేసా అని ప్రశ్నించారు. దీనికి రేవంత్‌ రిప్లయ్‌ ఇస్తూ.. ప్రాజెక్టులో ఏం జరిగిందో సభ్యులతోపాటు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా సభలోనే ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు.

నాడు పర్యాటకంగా తీర్చిదిద్దుతామని..
ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయంలో కాళేశ్వరంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సర్పంచులు,ఎంపీటీసీలు, జñ డ్పీటీసీలు, ఎమ్మెల్యేలను బస్సుల్లో కాళేశ్వరం తీసుకెళ్లి చూపించారు. అంతేకాకుండా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. కానీ, పర్యాటకం కళ రాకుముందే మేడిగడ్డ కుంగింది. అన్నారానికి బుంగలు పడ్డాయి.

విచారణల్లో ఏమి తెలుతాయో కానీ.. తాము కక్ష సాధింపులకు పాల్పడలేదని.. వారే విచారణకు డిమాండ్‌ చేసినందున తాము విచారణ చేయించమని వాదించే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper