Homeటాప్ స్టోరీస్Ponnam Prabhakar vs Adluri Laxman : కేసీఆర్ అవసరం లేదు.. కాంగ్రెస్ ను కాంగ్రెసోళ్ళే...

Ponnam Prabhakar vs Adluri Laxman : కేసీఆర్ అవసరం లేదు.. కాంగ్రెస్ ను కాంగ్రెసోళ్ళే నాశనం చేస్తారు

Ponnam Prabhakar vs Adluri Laxman : కర్ర విరగకుండా పామును చంపుతారంటారు..కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్ దాటకుండానే.. కారాలు మిరియాలు నూరకుండానే.. తన కడుపులో చల్ల కదలకుండానే ప్రత్యర్థి కాంగ్రెస్ కుమ్ములాటలతో కుదేలవుతోంది. మంత్రులే బహిరంగంగా తిట్టుకోవడం.. కౌంటర్లు ఇచ్చుకోవడం..పంచాయితీ ఢిల్లీదాకా పోయిందంటే ఇక బీఆర్ఎస్ ఏం చేయకున్నా కాంగ్రెస్ కుదేలవుతోంది. కాంగ్రెస్ ను ఎవరో వచ్చి నాశనం చేయడానికి లేదని అర్థమవుతోంది. Congress Minister calls his colleague, Schedule Caste Minister Adluri Laxman […]

Ponnam Prabhakar vs Adluri Laxman : కర్ర విరగకుండా పామును చంపుతారంటారు..కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్ దాటకుండానే.. కారాలు మిరియాలు నూరకుండానే.. తన కడుపులో చల్ల కదలకుండానే ప్రత్యర్థి కాంగ్రెస్ కుమ్ములాటలతో కుదేలవుతోంది. మంత్రులే బహిరంగంగా తిట్టుకోవడం.. కౌంటర్లు ఇచ్చుకోవడం..పంచాయితీ ఢిల్లీదాకా పోయిందంటే ఇక బీఆర్ఎస్ ఏం చేయకున్నా కాంగ్రెస్ కుదేలవుతోంది. కాంగ్రెస్ ను ఎవరో వచ్చి నాశనం చేయడానికి లేదని అర్థమవుతోంది.

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెలుగు చూస్తున్న వివాదాలు, నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత గొడవలు పార్టీని తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి. నేతలు సరైన ఆలోచన లేకుండా ఆలస్యం, అనవసర విమర్శలు, హాడావిడితో ముందుకు వెళితే, ప్రజల్లో ఆశించిన సానుకూల ఫలితం అస్సలు కనిపించకపోవచ్చు.

తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై చేసిన వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి. కింద స్థాయిలోని ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఎదిగిన నాయకుడిగా పొన్నం ప్రభాకర్‌కు ఎస్టీ కులాల నాయకులపై ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగదు.

మరోవైపు, జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో ఇంకెవరో కాంగ్రెస్ నాయకుడు నిన్న మొన్న పొన్నంను ఉద్దేశించి, “పొన్నం ఏమైనా హైకమాండ్ అనుకుంటున్నాడా?” అంటూ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మొత్తం పరిణామం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది.

ఈ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందిస్తూ, జరిగిన పొరపాటుకు పొన్నం క్షమాపణ చెబితేనే ఆయనకు గౌరవం ఉంటుందని అన్నారు. దళిత సంఘాలు కూడా పొన్నం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్యాబినెట్ నుంచి ఆయన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగంలోకి దిగి ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు సమాచారం.

*అంతర్గత కుమ్ములాటలే అతిపెద్ద శత్రువు

పార్టీకి బయటి ప్రత్యర్థుల కంటే, అంతర్గత మొరపుబాటే అతిపెద్ద శత్రువుగా మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విమర్శలు లేదా ప్రతిపక్షాల వ్యూహాలపై అసంతృప్తి ఉన్నప్పటికీ, చివరకు కాంగ్రెస్ నాయకులే తమను తాము పతనం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి అంతర్గత సంఘర్షణలను సకాలంలో పరిష్కరించకపోతే, అది పార్టీకి దీర్ఘకాలికంగా హాని కలిగిస్తుంది.

తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ చుట్టూ వచ్చిన వివాదాలు, ఆ తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిగిన రగడ సోషల్ మీడియాలోనూ, ప్రధాన వార్తల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా అసంతృప్తిని పెంచుతున్నాయి. ఇవి కేవలం వ్యక్తిగత అంశాలుగా కాక, పార్టీ పరువుకు భంగం కలిగించే అంశాలుగా పరిగణించబడాలి.

ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. కాంగ్రెస్ మంత్రులు ఆధిపత్యం, ఇగోలతో వాళ్లకు వాళ్లే కొట్లాడుకుంటున్నారు. ఇందులో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రమేయం ఏమాత్రం లేదు. వాళ్లు కొట్టుకుంటుంటే దాన్ని వైరల్ చేస్తూ పండుగ చేసుకోవడం తప్ప బీఆర్ఎస్ చేస్తున్నది ఏమీ లేదు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్ అవసరం లేదని.. కాంగ్రెస్ ను కాంగ్రెసోళ్లే నాశనం చేసుకుంటున్నారన్న చర్చ ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో సాగుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper