Korean Kanakaraju: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యే మీమ్స్ ని సినిమాల్లో కామెడీ కోసం ఉపయోగించడం చాలా సాధారణం అయిపోయింది. థియేటర్స్ లో మొదటి వీకెండ్ కదిలేది జెన్ జీ ఆడియన్స్ కాబట్టి, వాళ్ళ నుండి ఈ కామెడీ కి థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో , డైరెక్టర్స్ , మేకర్స్ కూడా అలాంటి సన్నివేశాలపైనే ఈమధ్య ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈరోజు విడుదలైన వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ లో కూడా అదే చేసాడు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. వరుణ్ తేజ్ హీరో గా నటించిన ఈ సినిమాకు నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ వెయ్యగా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా కమెడియన్ సత్య తన కామెడీ విశ్వరూపం చూపించాడని, మంచి టైం పాస్ ఎంటర్టైనర్ అంటూ ప్రశంసించారు.
అయితే వారం రోజుల క్రితం సీనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్స్ లో ఒకటైన ‘యుగ పురుషుడు’ అనే చిత్రం లో ఎన్టీఆర్ , చంద్ర మోహన్ ల మధ్య వచ్చే కరాటీ ఫైట్ సీక్వెన్స్ పై సోషల్ మీడియా లో చాలా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ ఫైట్ లో చంద్రమోహన్ ఎన్టీఆర్ ని కొట్టగానే , ఎన్టీఆర్ ‘మీ స్ట్రోక్ చాలా Amateurish గా ఉంది, ఇంతకు ముందు ఎక్కడైనా ఫైట్ చేశారా’ అని అంటాడు ఎన్టీఆర్. దీనిపై సోషల్ మీడియా లో గతం వారం రోజుల నుండి వేల సంఖ్యలో మీమ్స్ వచ్చాయి. అయితే ఈ సన్నివేశాన్ని ‘కొరియన్ కనకరాజ్’ మేకర్స్ ఎప్పుడు చూశారో తెలియదు కానీ, ఒక సన్నివేశం లో విలన్ కమెడియన్ సత్య ని చితక బాధగానే , ‘వీడి స్ట్రోక్స్ చాలా Amateurish గా ఉన్నాయి’ అంటాడు. దీనికి థియేటర్స్ లో బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది , ఆడియన్స్ పగలబడి నవ్వుకున్నారు.
కానీ సోషల్ మీడియా లో నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యారు. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కూటమి ప్రభుత్వం లో ఒక భాగమే , అయినప్పటికీ కూడా కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోయిన ఎన్టీఆర్ గారి ని అగౌరవపరుస్తూ , ఆయన తనయుడు వరుణ్ తేజ్ ఇలాంటి సన్నివేశాలు పెట్టడం దురదృష్టకరమని , తక్షణమే ఆ సన్నివేశాన్ని తొలగించి నందమూరి అభిమానులకు క్షమాపణలు చెప్పాలని , లేదంటే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుందని అంటూ హెచ్చరిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. దీనికి మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ వరుణ్ తేజ్ కి ఎన్టీఆర్ ని అవమానించే ఉద్దేశ్యమే లేదని , కేవలం సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయినటువంటి లేటెస్ట్ వైరల్ మీమ్ కాబట్టే ఆ సన్నివేశాన్ని తీసారని అంటున్నారు. మరి దీనిపై మూవీ టీం స్పందిస్తుందో లేదో చూడాలి.
వావ్ అద్భుతంగా ఉంది కద @naralokesh అన్న ..
చాలా నాచురల్ గా ట్రోల్ చేసారు మీ తాత గారిని .ఏంట్రా వారం నుంచి ఆ పర్టిక్యులర్ సీన్ ని ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి ఫ్యామిలీ బ్యాచ్ అనుకున్నా ..
పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ట్రోలింగ్ చేస్తున్నారు అని అర్థం అయింది !!మీరు పొత్తు కోసం ఆ… pic.twitter.com/vepIeXYERd
— సుజత్ God Of War️☪️✝️ (@Kadirodu_Offl) August 6, 2026