Sri Reddy: శ్రీ రెడ్డి.. ఒకప్పుడు యాంకర్ గా పని చేసింది. వివాదాస్పద నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ ఉంటుంది. పైగా తాను ఎప్పటికీ యాక్టివ్ గా ఉంటుంది.
సామాజిక మాధ్యమాలలో సినిమాలకు సంబంధించిన విషయాలను.. రాజకీయాలకు సంబంధించిన విషయాలను.. సామాజికపరమైన అంశాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా. తనకు ఎదురైన విమర్శలు.. తనకు ఎదురైన అనుభవాల గురించి ఆమె ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటుంది.
ఇటీవల శ్రీరెడ్డి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చింది. గతంలో తాను సపోర్ట్ చేసిన వైసీపీకి సంబంధించి కీలకమైన అంశాలను వెల్లడించింది. తాను పార్టీ కోసం ఎంతో చేసినప్పటికీ గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్ని రకాల ఒత్తిడులు ఎదురైనప్పటికీ తాను పార్టీ కోసం పని చేశానని.. పార్టీకి బహిరంగంగానే మద్దతు పలికానుని ఆమె పేర్కొన్నారు. తాను ఎంతగానో సేవలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని.. చివరికి ఇంత చేసినప్పటికీ గుర్తింపు లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పైగా తనను పొమ్మనలేక పొగ పెట్టినట్టు దూరం పెట్టారని.. చివరికి సాక్షి పేపర్.. సాక్షి ఛానల్ లో కూడా తన గురించి ప్రస్తావించలేదని ఆమె వెల్లడించింది.
ముఖ్యంగా జగన్.. యాంకర్ శ్యామల మీద శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.. శ్యామల కేవలం గత ఎన్నికల్లో రెండు రోజులకు ముందుగా పార్టీలోకి వచ్చిందని.. నాడు సిద్ధం సభలకు ఆమె గెస్ట్ గా వచ్చిందని.. దానికి ఆమె నాకేం లాభం అనే కోణంలో ఆలోచించిందని శ్రీరెడ్డి ఆరోపించండి. అంత కాదు శ్యామల ఒక కుంభకోణంలో ఇరుక్కుందని శ్రీ రెడ్డి సంచలన విమర్శలు చేసింది. శ్యామల సంబంధించిన పర్సనల్ వివరాలు మొత్తం తన దగ్గర ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. రకరకాల అక్రమాలలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని జగన్ దగ్గరికి తీయడం బాధగా ఉందని శ్రీరెడ్డి చెప్పింది. అటువంటి వ్యక్తులతో కలిసి జగన్ ఫోటోలు దిగుతున్నారని శ్రీ రెడ్డి ఆరోపించింది.
రకరకాల అభియోగాలలో ఇరుక్కున్న వారిని వైసిపి నేతలుగా గుర్తించడం.. వారిని ప్రజల్లో అధికార ప్రతినిధులుగా పేర్కొనడం మంచిది కాదని శ్రీరెడ్డి వెల్లడించింది. రోజాతో సమానంగా శ్యామలను చూడడం సరికాదని శ్రీ రెడ్డి జగన్ గుర్తుంచింది. తనను కార్నర్ చేస్తున్నారని.. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు వైసీపీ నేతలను డబ్బులు అడిగినట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడానికి తాను రెడీగా ఉన్నానని.. పార్టీ తరఫున తనకు అవకాశాలు లభించడం లేదని శ్రీరెడ్డి వాపోయింది. పాత్రికేయుడు సాయిని ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి విమర్శలు చేసింది. తన పేరు మీద వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించింది. తన చేతిలో కూడా సోషల్ మీడియా ఉందని.. తాను కూడా స్పందిస్తానని సాయిని ఉద్దేశించి ఆమె హెచ్చరించింది.
వైసిపికి గతంలో తాను సపోర్ట్ చేయడంవల్లే యూట్యూబ్ ఛానల్ కు ఇబ్బందులు ఎదురయ్యాయని శ్రీరెడ్డి వాపోయింది. తన వీడియోల మీద రిపోర్టులు వచ్చాయని.. ఆదాయం కూడా కోల్పోవాల్సి వచ్చిందని శ్రీ రెడ్డి బాధపడింది.. ఎన్నో రకాలుగా త్యాగాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని.. ఇప్పటికి బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రీరెడ్డి చెప్పింది. ఒక సందర్భంలో బయటికి వెళ్లాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఎన్ని రకాలుగా పార్టీ కోసం పనిచేసినప్పటికీ గుర్తింపు లేకుండా పోయిందని శ్రీరెడ్డి కన్నీరు పెట్టుకుంది.
View this post on Instagram