Poison Fed As Medicine: చూస్తూ చూస్తూ విషాన్ని ఎవరూ తాగరు. ఎదుటివారు తాగాలని కూడా కోరుకోరు. కానీ మన ప్రభుత్వాలు అలా చూస్తూ ఇక ఉండిపోయాయి. సిరప్ రూపంలో ఉన్న విషం తాగుతుంటే నిశ్శబ్దాన్ని నటించాయి. ఫలితంగా చాలా మంది పిల్లల ప్రాణాలు గాలిలోI కలిసిపోయాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వానిది సింహభాగం తప్పుంటే.. తయారుచేసిన కంపెనీ, రాసిన వైద్యులు ఈ దారుణంలో పాలుపంచుకున్నారు.
ప్రస్తామన దేశ వ్యాప్తంగా ఇప్పుడు కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ సిరప్ తాగి మన దేశ వ్యాప్తంగా 15 మంది చిన్నారులు బలయ్యారు. వీరంతా కూడా ఐదు సంవత్సరాలలోపు వారే. కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. వాస్తవానికి దగ్గు మందులు రసాయనాలు కలపడం నిషేధం. కానీ ఆ కంపెనీ ఆ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కింది. అంతేకాదు అడ్డగోలుగా కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ లు విక్రయించింది. వైద్యులకు తాయిలాలు ఎర వేసి కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ ను పిల్లలు తాగేలా చేసింది.
మొదట్లో కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ తాగిన పిల్లలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత అందులో ఉన్న రసాయనాలు వారి శరీరాల మీద ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. దగ్గు తగ్గడం మాట అటు వంచితే.. చివరికి వారి ప్రాణాలు పోయాయి. 2022లో మన దేశం నుంచి కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ గాంబియా దేశానికి ఎగుమతి అయ్యాయి. అక్కడ దాదాపు డజన్ మంది పిల్లలు చనిపోయారు. అయినప్పటికీ ఆ దారుణం నుంచి మన దేశం పాఠాలు నేర్చుకోలేదు. దీనికి తోడు ఔషధాల తయారీలో వ్యవస్థాపరమైన లోపాలు ప్రజల ప్రాణాలను ఎలా తీస్తున్నాయో ఈ ఉదంతం బయటపెట్టింది. దీనిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ నిర్వహించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది.
కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ విషయంలో అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కంపెనీకి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చింది. అధికారులు కూడా తనిఖీలు నిర్వహించడం విఫలమయ్యారు. కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ ను తమిళనాడు రాష్ట్రానికి చెందిన శ్రీ సన్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీ నిబంధనలు పాటించకపోగా.. ప్రమాదకర రసాయనాలను కలిపింది. వీటివల్ల చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ రసాయనాల వల్ల చిన్నారులు మెల్లిమెల్లిగా మరణానికి దగ్గరయ్యారు. పిల్లల ప్రాణాలు పోవడంలో అధికారులు, ప్రభుత్వం, శ్రీ సన్, వైద్యులు అందరూ భాగస్వాములేనని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఆ కంపెనీ పై చర్యలు తీసుకొని.. చనిపోయిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.