Home Guard Job: భర్త చనిపోయాడు. కారుణ్య నియామకం కింద ఆమెకు హోంగార్డు ఉద్యోగం వచ్చింది. కానీ ఉన్నతాధికారుల వేధింపులు. ఆపై ఆ ఇళ్లల్లో పనిచేయాలని ఆదేశాలు. వినకపోతే సరికి ఆమె సస్పెన్షన్. దీంతో ఆమె ఆవేదన అంతా ఇంతా కాదు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పోలీస్ శాఖ పనితీరును ప్రశ్నిస్తోంది. ఇప్పుడు వైరల్ అంశంగా మారడంతో పోలీస్ శాఖ సైతం స్పందించింది. నేరుగా ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కృష్ణాజిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
* కారుణ్య నియామకం..
కృష్ణా జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ అనారోగ్యంతో చనిపోయారు. కారుణ్య నియామకం కింద ఆయన భార్యకు సి కేటగిరి హోంగార్డుగా నియమించారు. అయితే ఈ క్యాటగిరి సిబ్బంది గార్డెనింగ్, టైలరింగ్, శానిటేషన్ తదితర విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో అప్పగించే పనులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆమె గత నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి బదిలీ లేకుండా పెనమలూరు పోలీస్ స్టేషన్ లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె సస్పెన్షన్కు గురయ్యారు. దానికి ఆమె చెబుతున్న కారణం పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లల్లో పనిచేయాలని ఒత్తిడి చేయడం.. మానసికంగా హింసిస్తుండడం.. దానిని ప్రశ్నించినందుకే తనపై వేధింపులకు గురిచేస్తూ సస్పెన్షన్ చేశారని ఆరోపిస్తున్నారు.
* ఎస్పీ కార్యాలయం స్పష్టత..
మరోవైపు కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది. ఆమెను ఏ పోలీస్ అధికారి కూడా హింసించలేదని.. ఇంటి పనులకు నియమించలేదని స్పష్టం చేసింది. హోంగార్డ్ శిక్షణ కోసం హెడ్ క్వార్టర్స్ కు హాజరు కావాలని ఆదేశిస్తే.. ఆమె సహకరించలేదని పేర్కొంది. విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం.. ఉన్నతాధికారుల అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించకపోవడం.. తనకు అనుకూలంగా మాత్రమే విధులకు వస్తానని చెప్పడం అంటే అంశాలు కార్యాలయం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. తనకు నచ్చిన చోటే పోస్టింగ్ ఇవ్వాలని వివిధ మార్గాల్లో అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారని.. వ్యక్తిగత సమస్యలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించిన ఆమె వినలేదని.. విధులకు తరచూ గైర్హాజరవుతున్నట్లు వచ్చిన నివేదికల ఆధారంగానే శాఖా పరమైన చర్యల్లో సస్పెన్షన్ వేటు వేసినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Homeguard.. the ancient British era job for working in their quarters.. still continuing the slavery in the name of employment.. Mera Bharath Mahaan
— Santosh Kumar (@santosh0535s) August 7, 2026