Great Andhra vs Pawan Kalyan : తాము చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే ‘వ్యభిచారం’ అన్నట్టుగా ఉంది ‘గ్రేట్ ఆంధ్రా’ రాతల పరిస్థితి. వీటిని రాతలు అనే బదులు.. రోతలు అంటే నయం ఏమో.. మైండ్ నిండా వైసీపీ భజనను నింపుకొని.. ప్రతిపక్షాలను హీనులుగా అభివర్ణిస్తూ… జగన్ ను దైవాంశ సంభూతుడిగా కీర్తిస్తూ.. ఆయన సంకనాకే రాతలు తప్ప ఏమైనా జర్నలిజం విలువలకు.. ప్రతిపక్షాలు, ప్రజల గొంతులకు విలువనిచ్చే రాతలు ‘గ్రేట్ ఆంధ్రా’ రాస్తోందా?… ఈ గ‘లీజు’ మీడియా రాసే వంటి దౌర్భగ్య రాతలు ఏ తెలుగు మీడియాలో ఎవరూ రాయరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

‘మహర్జాతకుడు పవన్ కళ్యాణ్’ అంటూ గ్రేట్ ఆంధ్రా రాసిన విద్వేషపు సంపాదకీయం చూశాక.. అసలు జగన్ ను, వైసీపీని ఎదిరించేవారు ఎవరూ ఉండకూడదని.. ప్రజల గొంతును వినిపించకూడదని.. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా.. రాజకీయంగా కించపరిచేలా నికృష్టపు రాతలు రాసిన ఆ జర్నలిస్టు ఎదురుగా నిలబడితే జనాలే ఉమ్మేసే పరిస్థితి నెలకొంది. వాళ్లు కనిపిస్తే కొట్టిన కొట్టేస్తారు మరీ.. అంత దిగజారుడు రాతలవీ..
ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం ఒక మహిళ తన చంటిబిడ్డతో ఆయన బస చేసిన హోటల్ ముందు ఉద్యమించింది. అదీ ప్రజల్లోంచి వచ్చిన నిరసన.. ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవ్వరూ ఇలా రారు.. చేయరు. అభిమానంతో చేసిన పని ఇదీ.. దీన్ని కూడా వైసీపీ కోసం ఫణంగా పెట్టి వెకిలి రాతలతో ఇదో ఉద్యమం కానట్టు ఫోకస్ చేస్తున్న గ్రేట్ ఆంధ్రా రాతలను ఏమని వర్ణించాలి? ఎంతగా తిట్టాలన్నా మాటలు రాని పరిస్థితి నెలకొంది.
‘‘చిరంజీవి ఏకపత్నీవత్రుడు.. మాటలు పడుతూ ఉండలేక రాజకీయం వదిలేశాడని’’ రాసుకొచ్చారు. అంటే దీనర్థం.. వైసీపీ వాళ్లు ఎంత తిట్టినా కూడా భరించడం ఎందుకు? పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకోవాలని ఆ గ్రేట్ ఆంధ్రా రైటర్ సెలవిచ్చాడు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లను ప్రశ్నిస్తూ.. ఆయన ప్రాతివత్యాన్ని.. వ్యక్తిగత విషయాలను అవహేళన చేశాడు. ఆయన రాతల పరామర్తం ఏంటంటే… వాళ్లు ఆభిమానించే వైసీపీకి ఎదురే ఉండకూడదని.. వాళ్లను ఎదురించేవాడు రావద్దని.. వారి సంకనాలనేది ఈ చెత్తరాతల హితబోధ.. ఇంతకంటే ఘోరమైన రాతలుంటాయా? జర్నలిజం విలువనే ఫణంగా పెట్టి వైసీపీ భజన చేసే రాతలు రాయడం తప్ప ఇందులో విలువలకు పెద్దపీట ఎక్కడ ఉంది? ఇదేనా మీ రాతల రోత అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
పవన్ ను, ఆయన అభిమానులను నిత్యానందతో పోల్చి అలాంటి అభిమానులను పొందడం మహర్జాతకమే అన్నట్టుగా వెకిలిరాతలు రాశారు. నిజంగా పవన్ ను అంత అభిమానించేవారు లేకుంటే వైసీపీ గర్జన ఎందుకు అంతలా వెలవెలబోయింది.. పవన్ రోడ్డు షోనే అంతలా ఎందుకు నిండిపోయిందో? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి.. ఎంతసేపు జగన్ భజనలో పడిపోయి అసలు ప్రజా అభిమానాన్ని, వ్యతిరేకతను చూడని ‘దృతరాష్ట్ర’ చూపు ఈ వెబ్ సైట్ ది.. ఆ రాసే జర్నలిస్టులదీ..
జగన్ ఏదో పీహెచ్.డీ చేసినట్టు.. ఆయన అపర మేధావి అన్నట్టు పవన్ కళ్యాణ్ చదువును అవహేళన చేసిన నీచపు రాతలు ఈ గ్రేట్ ఆంధ్రా సొంతం. పవన్ సీఈసీ చదివితే ఏంటి.. ఇంటర్ మానేస్తే ఏంటి? ‘బీకాంలో ఫిజిక్స్ ’ అంటూ అవహేళన చేసే రాతలు రాయడం ఏమేరకు జర్నలిజం అన్నది గ్రేట్ ఆంధ్రా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పవన్ ను వెనుకుండి నడిపిస్తున్నది త్రివిక్రమ్, నాదెండ్ల అంటూ ఆయన రాజకీయ, సినీ జీవితాన్ని అవమానించేలా రాశారు. ఆయన ఫ్యాన్స్ ను గొర్రెలతో పోల్చారు. మరి జగన్ ను నడిపించేది ఎవరు? జగన్ సూటిగా ప్రెస్ మీట్ లో కనీసం పవన్ కళ్యాణ్ లా అయినా మాట్లాడగలగడా? పవన్ లా సమాధానాలు ఇవ్వగలడా? ఒక చరిత్ర గురించి చెప్పగలడా? పవన్ కు ఉన్నంత జ్ఞానం, భావజాలం.. మీరు అభిమానించే నేతల్లో ఉందా? జగన్ ను వీరాధివీరుడిగా ఫోకస్ చేసే ముందు ఆయన శక్తి సామర్థ్యాలపై ఓపెన్ డిబేట్ పెట్టి ఎవరి సత్తా ఏంటో ఇదే గ్రేట్ ఆంధ్రా తేల్చాలి. అప్పుడే మీ భజన వీరుడు.. ఈ జనసేనకుడి సత్తా తెలుస్తుంది కదా.. ఒకరిని అనేముందు మిగతా నాలుగువేళ్లు మీవైపే చూపిస్తాయన్న నిజాన్ని మరవకూడదు.
పోలీసులు నిర్బంధించి హోటల్ లో బంధిస్తే మూడు రోజులు పవన్ తన అభిమానులు, పార్టీ నేతలను కలుసుకోలేక గిలగిలలాడారు. వీడియోలు తీసి వారికి భరోసానిచ్చారు. దాన్ని కూడా సినిమా స్టంట్ అని రాసుకువచ్చే చెత్త కూతలు గ్రేట్ ఆంధ్రా చేసింది. ఆయనను వదిలితే తెలిసేది కదా.. ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యే విధానం.. కలిసిపోయే తీరు. హోటల్ గదిలో పోలీసులతో బంధించి పోకుండా చేసి ఆయన తాపత్రయంపై కూడా వెకిలిరాతలు రాస్తే ఇదేం జర్నలిజం అని ఆ మీడియాను అందరూ ప్రశ్నిస్తున్నారు.
జనసేన నేతలను అరెస్ట్ నుంచి విడిపించడానికి పవన్ ధర్నా చేయాల్సింది అంటూ సలహాలు ఇచ్చింది ఈ మీడియా. పవన్ లాంటి వ్యక్తి రోడ్డెక్కితే శాంతి భద్రతలు అదుపుతప్పుతాయి. పోలీసులపై దాడులు జరగవచ్చు. అదే కదా వైసీపీకి కావాల్సింది. పవన్ పోలీసులను చంపించాడని.. ఆయన రాజకీయ జీవితంపై ముద్రవేసి ప్రజలకు దూరం చేసే కుట్ర. ఈ సమిధలో ప్రజలు చనిపోయి పవన్ కు వ్యతిరేకత తెచ్చే ప్రయత్నాలు చేస్తారు. అది తెలిసి కనుకనే పవన్ సంయమనం పాటించాడు. శాంతిమంత్రం జంపించాడు. వైసీపీ ట్రాపులో పడలేదు. దీన్ని పవన్ వెనకడుగు వేశాడని.. అరెస్ట్ అయిన జనసైనికులను పట్టించుకోలేదన్నట్టు ఫోకస్ చేశారు. నిజానికి జనసేన లీగల్ టీంతో కలిసి అందరికీ బెయిల్ ఇప్పించే ప్రయత్నాలు చేశారు. వారికి బెయిల్ వచ్చాకే విశాఖ వదిలి విజయవాడ వచ్చారు.
ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ ఒంటరిగా పోరాడారు. ఆయన పోరాటానికి చివర్లో టీడీపీ, బీజేపీ సపోర్టు ఇచ్చింది. పవన్ పోరాటం వెనుక చంద్రబాబు ఉన్నాడని వెకిలి రాతలు రాశారు. మీడియాలో స్పష్టంగా మోడీషాలకు ఫిర్యాదు చేయడానికి తానేం చిన్న పిల్లాడిని కాదని చెప్పినా కూడా పవన్ స్థాయిని దిగజార్చేలా ఆయన వెనుకున్నది వీరు అంటూ అవాకులు చెవాకులు రాశారు.
చివర్లో పవన్ ను అభిమానించే వారిని ‘పిచ్చిజనం’తో పోల్చింది సదురు గ్రేట్ ఆంధ్రా..ఇదే పిచ్చి జనం 2019లో అంతే పిచ్చిగా జగన్ ను గెలిపించారు. అప్పుడు వారిని పిచ్చి జనం అని ఎందుకు అనలేదు. అంటే జగన్ ను అభిమానిస్తే వారు మంచి జనం.. పవన్ ను అభిమానిస్తే పిచ్చి జనం. ఇదేనా మీ ‘పిచ్చి’ రాతల మహత్య్మం.
చేతిలో కలం.. అచ్చు వేయడానికి టాప్ వెబ్ సైట్ ఉంది కదా? అని ఏది పడితే అది.. ఇష్టమొచ్చినట్టు బూతులతో రాస్తే పడడానికి జనసైనికులు.. జనసేనాని, ప్రజలు అంత పలుచన కాదు.. మీ జగన్ భజనను మాని ప్రజల నాడిని పట్టుకోండి.. జగన్ విధేయతను చాటుకోవడానికి పవన్ పై విరుచుకుపడకండి.. మీ రాతలు.. రోతలు చూసి జనాలు కొట్టడం కాదు.. చెప్పులేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో క్రిటిసిజం అనేది ప్రణాళికబద్దంగా నేతలు, రాజకీయ పార్టీల్లో, ప్రజల్లో మార్పు వచ్చేలా ఉండాలి. కానీ బురదలో బొర్లి అందరికీ అంటించేలా కాదు.. ఇప్పటికే జగన్ భజన మాని ప్రజలకు ఉపయోగపడే.. వారి నాడి తెలుసుకొని రాతలు రాయండి ‘గ్రేట్ ఆంధ్రా’. అప్పుడే మీ చెత్త రాతలకు విశ్వసనీయత ఉంటుంది. లేదంటే చెప్పులేసే రోజులు దగ్గరలోనే ఉంటాయి.
-నరేశ్
