HomeతెలంగాణMulugu: మళ్లీ ములుగు జిల్లా మీదే.. ప్రకృతికి ఎందుకింత పగ..

Mulugu: మళ్లీ ములుగు జిల్లా మీదే.. ప్రకృతికి ఎందుకింత పగ..

Mulugu: సరిగ్గా గత ఏడాది మేడారం పరిసర ప్రాంతంలో భూకంపం వచ్చింది. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దల వద్ద ప్రకంపనలు నమోదు అయ్యాయి. తాడ్వాయి దగ్గర్లో ఉన్న అడవిలో అనూహ్యంగా రాకాసి గాలి వీచింది. అక్కడ భారీ స్థాయిలో వృక్షాలు నేల కూలిపోయాయి. ప్రాణ నష్టం సంభవించలేదు గాని.. వేలాది వృక్షాలు వేళ్ళతో సహా కూలిపోయాయి. అంతకుముందు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పనిచేసే పూజారులు చనిపోయారు. ఈ వరుస పరిణామాలతో అక్కడ ఏదో జరుగుతోంది […]

Mulugu: సరిగ్గా గత ఏడాది మేడారం పరిసర ప్రాంతంలో భూకంపం వచ్చింది. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దల వద్ద ప్రకంపనలు నమోదు అయ్యాయి. తాడ్వాయి దగ్గర్లో ఉన్న అడవిలో అనూహ్యంగా రాకాసి గాలి వీచింది. అక్కడ భారీ స్థాయిలో వృక్షాలు నేల కూలిపోయాయి. ప్రాణ నష్టం సంభవించలేదు గాని.. వేలాది వృక్షాలు వేళ్ళతో సహా కూలిపోయాయి. అంతకుముందు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పనిచేసే పూజారులు చనిపోయారు. ఈ వరుస పరిణామాలతో అక్కడ ఏదో జరుగుతోంది అని ఆందోళన మొదలైంది.

ఈ ఏడాది అంతగా వర్షాలు లేవు. గోదావరిలో చెప్పుకునే స్థాయిలో ప్రవాహం లేదు. ఇది నిన్నటి వరకు. ఇప్పుడు ములుగు జిల్లా పరిధిలో పరిస్థితి మారిపోయింది. ఎక్కడో అమెరికాలో వీచే టోర్నడోలు ములుగు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. గతంలో మాదిరిగానే రాకాసి గాలులు అతలాకుతలం చేశాయి. అడవిలో పెను ప్రకంపనలు సృష్టించాయి. గాలి మాత్రమే కాకుండా.. విపరీతంగా వర్షం కూడా కురిసింది. గోదావరి ప్రవాహం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అక్కడ ప్రకృతి ఏదో చెబుతూ ఉందని.. గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ములుగు జిల్లా పరిధిలో అడవి దట్టంగా ఉంటుంది. ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాలలో సెల్ఫోన్ సిగ్నల్స్ ఉండవు. సరైన రహదారులు కూడా ఉండవు. ఇటువంటిచోట భీకరంగా గాలులు వీస్తున్నాయి. విపరీతంగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. అసలు వాతావరణం ఇలా ఎందుకు మారిపోతుందో అర్థం కావడం లేదు. పైగా ఆదివాసి దేవతలు కొలువైన ప్రాంతంలో ఇటువంటి వాతావరణం ఏర్పడటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా మంగపేట నుంచి కోమటిపల్లి వరకు ఒక టోర్నడో కనిపించింది. ఆకాశం నుంచి కిందికి వాలినట్టు భీకరమైన గాలి వచ్చింది. ఆ గాలి తాకిడికి చెట్లు మొత్తం విరిగిపోయాయి. పంట చేలు నాశనమయ్యాయి. దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. ఈసారి కూడా ప్రకృతి ఏదో హెచ్చరికలు పంపిస్తోందని.. ములుగు జిల్లా పరిధిలో ఏదో జరుగుతోందని.. సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ములుగు జిల్లా పరిధిలో దట్టమైన అడవులు ఉంటాయి. ఈ అడవులకు తగ్గట్టుగానే అక్కడ వర్షాలు నమోదు అవుతుంటాయి. ఇది వింత కాకపోయినప్పటికీ.. అక్కడ ఈ స్థాయిలో రాకాసి గాలులు వీయడం స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది. ఇక్కడ మాత్రమే ఇటువంటి వాతావరణం ఎందుకు ఏర్పడుతోంది.. దేవతామూర్తులకు ఏదైనా ఆగ్రహం కలిగించే పని జరిగిందా.. అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper