Rashmi Gautam latest photos : జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించిన వారిలో ఒకరు రష్మీ. అంతకు ముందు ఈమె సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేది , ఆ తర్వాత పలు టీవీ షోస్ కి యాంకర్ గా చేసింది , కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే జబర్దస్త్ షో లోకి ఈమె ఎంట్రీ ఇచ్చిందో , అప్పటి నుండి ఈమె జాతకం పూర్తిగా మారిపోయింది. ఒక హీరోయిన్ కి ఎంత క్రేజ్ వస్తుందో , ఈమెకు కూడా యూత్ ఆడియన్స్ లో అదే రేంజ్ క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఈమెకు వరుసగా టీవీ షోస్ లో యాంకర్ గా చేసే అవకాశాలు రావడం, ఆ తర్వాత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం వంటివి చేసింది. చాలా సినిమాలే చేసింది కానీ, అందులో కేవలం ‘గుంటూరు టాకీస్’ ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది.
ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతుల్లో జబర్దస్త్ షో మాత్రమే ఉంది. నిన్న మొన్నటి వరకు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో కి కూడా యాంకర్ గా చేసింది కానీ , ఇప్పుడు ఆమె స్థానం లోకి ప్రదీప్ ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పటి తో పోలిస్తే రష్మీ ఊపు ఈమధ్య కాలం లో బాగా తగ్గింది అనే చెప్పాలి. అయితే సోషల్ మీడియా లో మాత్రం ఈమె మొదటి నుండి చాలా యాక్టీవ్ గా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈమెని లక్షల మంది అనుసరిస్తున్నారు , ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు , వీడియోలు , స్టోరిలకు వేల సంఖ్యలో లైక్స్ కొడుతూ ఉంటారు. అంతే కాదు సమాజం లో జరిగే అంశాలపై , ఎలాంటి ఫిల్టర్లు లేకుండా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఈమె స్టైల్. అందుకు చాలా విమర్శలు కూడా ఎదురుకోవాల్సి వచ్చింది.
అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈమె హాట్ ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గానే ఈమె ఓపెన్ బాత్ టబ్ లో స్నానం చేస్తూ , అందుకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలను చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. అబ్బాయిలను అందచందాలతో పిచ్చెక్కించాలంటే రష్మీ తర్వాతే ఎవరైనా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ కంటే రష్మీ చాలా బాగుంటుంది , అలాంటి ఆమెకు అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే కుర్రకారులను పిచ్చెక్కిస్తున్న రష్మీ లేటెస్ట్ ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.