Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీద ప్రేక్షకులకు చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా ఈ సినిమా నుంచి హీరో హీరోయిన్ కి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు వెంకటేష్ కూతురి క్యారెక్టర్ లో నటిస్తున్న అమ్మాయి సంపూర్ణ అనే క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు…వెంకటేష్ తన అసిస్టెంట్ తో రిజిస్ట్రేషన్ పనులు చూయిస్తే ఇక ప్రశాంతంగా ఉంటానని చెబుతుంటే తన కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ ‘ఐ యామ్ ఇన్ లవ్’ అని చెబుతుంది. దాంతో వెంకటేష్ ఈసారి ఎవడే కార్ మెకానికా అంటాడు ఆమె అవునని చెబుతుంది. అసలు మీ జనరేషన్ వాళ్ళకి లవ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా అని వెంకటేష్ అడగ్గా తన కూతురు ‘నాకేం అవుతుందోనేను బాధ కంటే వాడికేమవుతుందో అనే భయం ఎక్కువైతే అదే ప్రేమ’ అంటూ ఆమె చెబుతుంది.
దాంతో పక్కనున్న రఘుబాబు ఆదర్శ కుటుంబం అంటాడు. ఇక ఈ మూవీ సీక్వెన్స్ లో ఒక్కొక్కరి ని పరిచయం చేస్తున్నారు బాగుంది. కానీ వెంకటేష్ ఈ డికేడ్ లో అనిల్ రావిపూడితో ఎక్కువ సినిమాలు చేయడం వల్లనో లేదంటే త్రివిక్రమ్ తీసుకున్న పాయింట్ కూడా అలానే ఉండడం వల్లనో తెలియదు.
కానీ మొత్తానికైతే ఈ మూవీ నుంచి వచ్చే అన్ని వీడియోలు అనిల్ రావిపూడి సినిమాల్లో మాదిరిగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్న వచ్చిన వీడియోలు కొంచెం బాగున్నాయి. ఇవాళ్టి వీడియో అయితే మరి దారుణంగా ఉంది. మొత్తానికైతే త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు. ఎందుకని ఆయన ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు.
వెంకటేష్ తో డిఫరెంట్ స్టోరీ ట్రై చేయొచ్చు కదా…అవన్నీ వదిలేసి మళ్లీ రొటీన్ రొట్ట ఫార్ములా లోనే సినిమాలు చేస్తే ఎవరు చూస్తారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…ఇక త్రివిక్రమ్ ను ఇష్టపడే వాళ్ళు సైతం ఈ సినిమాలో ఒక డిఫరెంట్ కథ చెప్పే ప్రయత్నం చేయండి సార్ అంటున్నారు…