HomeతెలంగాణKTR: కేసీఆర్ బర్త్ డే: కేటీఆర్ శునకం అన్నది ఎవరిని?

KTR: కేసీఆర్ బర్త్ డే: కేటీఆర్ శునకం అన్నది ఎవరిని?

KTR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. “కొందరు ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా […]

KTR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. “కొందరు ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అంటున్నారు. కెసిఆరే తెలంగాణ ఆనవాలు కదా.. అలాంటప్పుడు ఆ ఆనవాలు లేకుండా ఎలా చేస్తావురా సన్నాసి.. కెసిఆర్ శిఖరం.. నువ్వు ఒక శునకం” అని కేటీఆర్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.

కేటీఆర్ అలా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించకపోయినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కేటీఆర్ అలా మాట్లాడటం సంచలనం కలిగించింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ తీవ్ర స్వరంతో రేవంత్ మీద విమర్శలు చేశారు. తొర్రూరు.. సిరిసిల్ల మునిసిపాలిటీలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ మీద.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. రేవంత్ పొట్టోడు అని.. అతడికి పరిపాలన చేతకావడం లేదని ఎద్దేవా చేశారు.

ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పుడు కూడా కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉంటే కనీసం 90% మున్సిపాలిటీలు గెలుచుకోవాలి కదా.. అధికారంలో ఉండి కూడా ఇంత తక్కువ స్థానాలా? మేము ఏకంగా 13 మున్సిపాలిటీలు సాధించామని.. కేటీఆర్ అన్నారు. చివరికి రేవంత్ సాధించిన గెలుపును కూడా తక్కువ చేసే విధంగా కేటీఆర్ మాట్లాడారు.

ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి మీద కేటీఆర్ మరోసారి మాటల దాడి చేశారు. తన తండ్రి జన్మదినోత్సవం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శునకంతో పోల్చారు కేటీఆర్.. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదని.. తెలంగాణ అంటేనే కెసిఆర్ ఆనవాలు అని కేటీఆర్ అన్నారు. మొత్తంగా సందర్భం ఏదైనా సరే.. జరిగే కార్యక్రమం ఏదైనా సరే.. రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే.. ముఖ్యమంత్రిని తిట్టడానికే దానిని వాడుకుంటున్నారు కేటీఆర్.

మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. అంతకుముందు స్థానిక ఎన్నికల్లో పరాజయం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి.. ఇవన్నీ కూడా కేటీఆర్లో ఫస్ట్రేషన్ ను తీసుకొస్తున్నాయని.. అందువల్లే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్న తీరును తట్టుకోలేక కేటీఆర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ కేటీఆర్ తన తీరు మార్చుకోకపోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper