Homeజాతీయ వార్తలుBhairav ​​Commandos: భైరవ్‌ ఎంట్రీ.. శివరాత్రికి పాకిస్తాన్‌కు కాళరాత్రి చేసిన భారత్‌

Bhairav ​​Commandos: భైరవ్‌ ఎంట్రీ.. శివరాత్రికి పాకిస్తాన్‌కు కాళరాత్రి చేసిన భారత్‌

Bhairav ​​Commandos: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సైన్యం బలోపేతంపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించింది. వివిధ దేశాలతో డిఫెన్స్‌ ఒప్పందాలు తగ్గించి సొంత ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్థానికంగానే ఆయుధాలు తయారు చేస్తోంది. పీరక్షిస్తోంది. వరుస నో టామ్‌లతో మన పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను భయపెడుతోంది. తాజాగా శివరాత్రి పవిత్ర దినాన్ని పురస్కరించుకుని భారత సైన్యం ’భైరవ్‌’ బెటాలియన్‌పై అద్భుతమైన వీడియోను […]

Bhairav ​​Commandos: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సైన్యం బలోపేతంపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించింది. వివిధ దేశాలతో డిఫెన్స్‌ ఒప్పందాలు తగ్గించి సొంత ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్థానికంగానే ఆయుధాలు తయారు చేస్తోంది. పీరక్షిస్తోంది. వరుస నో టామ్‌లతో మన పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను భయపెడుతోంది. తాజాగా శివరాత్రి పవిత్ర దినాన్ని పురస్కరించుకుని భారత సైన్యం ’భైరవ్‌’ బెటాలియన్‌పై అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. అమితాబ్‌ బచ్చన్‌ గొంతుతో ’షాడో అండ్‌ స్టీల్‌’ సిరీస్‌లో వచ్చిన ఈ చిత్రణ పాకిస్తాన్‌ వంటి శత్రువులకు ’కాళరాత్రి’గా మారే సైనిక శక్తిని ప్రదర్శించింది.

భగవద్భక్తి–సైనిక శక్తి సమ్మేళనం
శివుని ఉగ్రరూపం ’భైరవ్‌’ నుంచి పేరు పొందిన ఈ లైట్‌ కాంబట్‌ యూనిట్, ’అభయం భైరవ్‌’ మంత్రంతో పనిచేస్తుంది. వీడియోలో దట్ట అడవుల్లో దాగి దాడి, నదీ మార్గాల ద్వారా దాటడం, ఎయిర్‌ డ్రాప్‌లతో స్వీప్‌ అటాక్‌లు చూపించారు. ఇది సైన్యం ఆధ్యాత్మికత, ఆధునిక ప్రత్యేక ఆపరేషన్ల సమ్మేళనాన్ని సూచిస్తుంది.

ఆకట్టుకునే ఆధునిక ఆయుధాలతో..
ఏకే–203 రైఫిల్స్, నెగెవ్‌ లైట్‌ మెషిన్‌ గన్‌లు, రాకెట్‌ లాంచర్లు, నైట్‌ విజన్, డ్రోన్‌లు, స్ట్రైక్‌ వెహికల్స్‌తో సమన్వయంగా పనిచేసే ఈ బెటాలియన్‌ ’ఫైట్‌ టు నైట్‌’ సూత్రంతో రాత్రి ఆపరేషన్లకు ప్రసిద్ధి. వీడియో సినిమాటిక్‌ ఫార్మాట్‌లో ఉండటం వల్ల దాని ప్రచార శక్తి ఎక్కువైంది.

పాకిస్తాన్, చైనా వంటి పొరుగు దేశాలకు ఈ వీడియో డిటరెంట్‌ మెసేజ్‌. పారా స్పెషల్‌ ఫోర్సెస్‌ల మధ్య లఘు కాంబట్‌ యూనిట్‌గా భైరవ్‌ దట్ట అడవులు, పర్వతాల్లో ద్రుత దాడులకు అనువుంది. డిజిటల్‌ మీడియాలో సైన్యం అవలంబించిన ఈ విజువల్‌ స్టోరీటెల్లింగ్‌ ప్రపంచ సైన్యాల స్థాయికి చేరింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper