Today August 15 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఉత్తర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ధన పండుగ ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారిలో ఈరోజు నూతన ఉత్సాహం ఉంటుంది. కొన్ని పనులు ఇబ్బందికరంగా ఉన్నా.. వాటిని వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఉద్యోగులు తోటి వారి సహాయం తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఉద్యోగులు అయితే వీరు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి పదోన్నతను పొందుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. విద్యార్థులు సృజనాత్మకతతో గురువులను ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. బంధువుల నుంచి ధన సహాయం ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. స్నేహితుల మధ్య కమ్యూనికేషన్ ఆగిపోకుండా చూసుకోవాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీంతో కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. కొన్ని ప్రాజెక్టులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. బంధువుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యాలయాల్లో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కళా రంగంలో ఉన్నవారికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు అదరపు బాధ్యతలు ఏర్పడతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు తమ మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పెట్టుబడులా విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో కోపాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు అనుకోని అదృష్టాన్ని పొందుతారు. కొన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు. అనవసరపు చర్చలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గొప్ప ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ఆలోచనలు వస్తాయి. దీంతో వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టును పూర్తి చేస్తారు. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సున్నితమైన ఆలోచనల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు.