నగరానికి ఉత్తరం వైపున బాచుపల్లిలో 27.36 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 279 ప్లాట్లతో తూర్పున మేడిపల్లి లో 55.12 ఎకరాలను 434 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ లేఅవుట్లు చేస్తోంది. తొలివిడతగా బాచుపల్లి, మేడిపల్లిలోని ప్లాట్లను మార్చి మొదటి వారంలో విక్రయించింది. డెవలపర్లు, రియల్టర్లు, ప్రజల నుంచి బాగా స్పందన వచ్చింది. బాచుపల్లిలో మొదటి విడతలో 50 ప్లాట్లు విక్రయించగా, హెచ్‌ఎండీఏ నిర్ణయించిన చ.గజం కనీస ధర రూ.25వేల కంటే 13,500 అధికంగా పలికింది. అత్యధికంగా చ.గజం ధర రూ.68వేలు, సగటున చ.గజం ధర రూ.59,149 పలికింది. గతంలో పోల్చితే ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరిగిన ఈ-వేలంలో బాచుపల్లి లేఅవుట్‌లో సగటున చ.గజం ధర రూ.19,475 తగ్గి రూ.39,674 ఖరారయింది. ఇక మేడిపల్లిలో లేఅవుట్‌లో తొలి విడతలో చ.గజం అప్‌సెట్ ధర రూ.32వేలు నిర్ణయిస్తే అత్యధికంగా రూ.63వేలు పలికింది. చ.గజం సగటున రూ.58,730 పలికింది. ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించిన వేలంలో సగటున చ.గజం ధర రూ.18,062 తగ్గి రూ.40,668 ఖరారైంది. ఈ సారి వేలం వేసిన ప్లాట్లలో కొన్ని మిగిలిపోవడం గమనార్హం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A single decision taken by kcr hyderabad real boom stopped aggression
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com