భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు వరద నీటిలో మునిగిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును పరిశీలించేందుకు రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి బయలుదేరి వెళ్లారు. ఈక్రమంలో తెక్కపల్లి వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు వాహనాల నుంచి కిందికి దిగకపోవడంతో వారికి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Congress mp rewanth reddy arrest by police
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com