Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీVivo V80 Lite 5G : 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. రెండు రోజులైనా ఒడవదు..

Vivo V80 Lite 5G : 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. రెండు రోజులైనా ఒడవదు..

Vivo V80 Lite 5G : ఇప్పుడున్న వాళ్ల ప్రతిచేతిలో దాదాపు ఫోన్ ఉంటోంది. ఏ చిన్న సందేహం కలిగినా.. వెంటనే మొబైల్ లో సెర్ఛ్ చేసేస్తున్నారు. దీని కోసం 5జీ స్పీడ్ నెట్ వాడుతున్నారు.. ఈ పనులన్నీ చేయడానికి భారీ బ్యాటరీ కావాల్సి ఉంటుంది. అయితే బ్యాటరీ కెపాసిటీ పెరిగితే ఫోన్ ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో తక్కువ ధరలోనే మొబైల్స్ […]

Vivo V80 Lite 5G : ఇప్పుడున్న వాళ్ల ప్రతిచేతిలో దాదాపు ఫోన్ ఉంటోంది. ఏ చిన్న సందేహం కలిగినా.. వెంటనే మొబైల్ లో సెర్ఛ్ చేసేస్తున్నారు. దీని కోసం 5జీ స్పీడ్ నెట్ వాడుతున్నారు.. ఈ పనులన్నీ చేయడానికి భారీ బ్యాటరీ కావాల్సి ఉంటుంది. అయితే బ్యాటరీ కెపాసిటీ పెరిగితే ఫోన్ ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో తక్కువ ధరలోనే మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇటీవల వివో కంపెనీకి చెందిన ఓ కొత్త ఫోన్ బ్యాటరీ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈరోజే అధికారికంగా ప్రారంభమయ్యే ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే ఈ కింది వివరాల్లోకి వెళ్లండి..

Vivoకంపెనీ ఇటీవల పాకిస్తాన్ లో ‘వి 80 లైట్’ అనే ఫోన్ గురించి ప్రకటించింది. ఇది 7,050 బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. అయితే లేటేస్ట్ గా 10,000 ఏంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఇదే ఫోన్ ను మలేషియా వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 3న(ఈరోజే) దీనిని అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. రోజూవారి ఫోన్ వినియోగదారులకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా కావాలని అనుకునేవారికి ఈ ఫోన్ చాలా వరకు ఉపయోగపడే అవకాశాలున్నాయని కంపెనీ తెలుపుతోంది. మరి ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే?

వివో వి 80 లైట్ కొత్త ఫోన్ గురించి ఫీచర్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పటికే పాకిస్తాన్ లో ప్రకటించిన ఫోన్ భట్టి దీనిని అంచనా వేస్తున్నారు. ఇందులో 6.83 అంగుళాల ఏమోల్డ్ డిస్ ప్లే ఉండనుంది. 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఇందులో 8 జీబీ ర్యామ్, 128 లేదా 256 జీబీ స్టోరేజ్ తో కలిగిన స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్ తో పనిచేయనుంది. 2 ఎంపీ కెమెరా ఇన్ బిల్ట్ తో పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ తో పనిచేస్తుంది. దీంతో సెల్ఫీలు అద్భుతంగా తీసుకోవచ్చు.

ఈరోజుల్లో బ్యాటరీ కెపాసిటీ బాగుంటేనే ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజూ ఫోన్ తోనే గడిపేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వీడియో చూసేవారికి కూడా ఇది సపోర్టుగా ఉండే విధంగా బ్యాటరీ కెపాసిటీని పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వివో ఫోన్ ఎలాంటి విక్రయాలు జరుకుపుంటుందో చూడాలి. ఈ ఫోన్ ఆన్ లైన్ లో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ధర రూ. 37,599తో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper