IT Layoffs : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. ఏఐ దెబ్బకు ఇప్పటికే 2025లో 1,20,000 జాబ్స్ పోగా.. ఈ ఏడాదిలో 8 నెలల్లోనే ఈ టార్గెట్ ను మించిపోయింది. మరో నాలుగు నెలలపాటు మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వదులుకునే అవకాశాలు ఉన్నాయని కొందరు తెలుపుతున్నారు. మరి ఈ 8 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు పోయాయి? అసలు కంపెనీలు ఏం ఆశిస్తున్నాయి? పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు, సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. దీంతో మ్యాన్ పవర్ ను వదులుకుంటున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. Layoff.fyi ప్రకారం ఈ ఏడాది ఎనిమిది నెలల్లో ఇప్పటివరకు 289 కంపెనీల్లో 1,23,305 మంది ఉద్యోగులను తీసివేసినట్లు తెలుస్తోంది. 2025 ఏడాదిలో 278 కంపెనీల్లో 1,22,606 ఉద్యోగాలు పోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే ఆ టార్గెట్ రీచ్ అయింది. రానున్న నెలల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని అంటున్నారు. ట్రూ ఆఫ్ డేటా ప్రకారం ఇప్పటివరకు 1,75,000 లకు పైగా ఉద్యోగాలు పోయినట్లు తెలిపింది.
మ్యాన్ పవర్ ను వదులుకున్న కంపెనీలో ఒరాకిల్ ప్రముఖ స్థానంలో ఉంది. ఈ కంపెనీలో 12 నెలల్లో 21 వేల ఉద్యోగాలు తొలగించింది. అమెజాన్ 17,267, డెల్ కంపెనీ 11,000.. మెటా కంపెనీ 10,400.. మైక్రోసాఫ్ట్ 4,800 ఉద్యోగాలు తొలగించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అలాగే పేపాల్, సిస్కో కంపెనీలు కూడా 4000 చొప్పున ఉద్యోగాలను వదులుకుంది.
ఈ కంపెనీలు తమకు అప్డేట్ తో పాటు వేగంగా పనిచేసే విధానం కావాలని కోరుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా మాన్ పవర్ కంటే ఏఐ అడ్వాన్స్గా ఉన్నట్లు గుర్తించి దానిని వాడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రోజువారి సాఫ్ట్వేర్, మాడరేషన్, ఆటోమేషన్ చేపట్టడంతో ఈ ఉద్యోగాలు తగ్గుతున్నట్లు సమాచారం. వీటికి తోడు ఖర్చు, రీ కన్స్ట్రక్షన్, బలహీనమైన డిమాండ్ కూడా ఉద్యోగాలు ఊడుతున్నట్లు కారణాలుగా ఉన్నాయి. కొన్ని కంపెనీలు లాభం కంటే ఖర్చులను తగ్గించుకోవడం పైనే ఆధారపడినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఏడాది మరో నాలుగు నెలల్లో మరిన్ని ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని చాలెంజర్, గ్రే అండ్ క్రిస్టమస్ తెలిపింది. ఏఐ వాడకం విపరీతంగా పెరుగుతున్నందున ఉద్యోగ భద్రతపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయని అంటుంది. అంతేకాకుండా టెక్నాలజీ రంగంలో పని చేసేవారు తమపై తామే నమకం లేకుండా ఉన్నారని అంటున్నారు.