Homeబిజినెస్Vivo OriginOS 7: ఐ ఫోన్ ను తలపించే గ్లాస్ యూఐ.. అదిరిపోయే యానిమేషన్స్..వివో ఓఎస్...

Vivo OriginOS 7: ఐ ఫోన్ ను తలపించే గ్లాస్ యూఐ.. అదిరిపోయే యానిమేషన్స్..వివో ఓఎస్ ఎలా పని చేస్తుందంటే..

Vivo OriginOS 7: స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కెమెరా.. బ్యాటరీ.. ప్రాసెసర్ మాత్రమే కాదు.. అందులో ఉండే సాఫ్ట్వేర్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది.. ఫోన్ ఎంత వేగంగా పనిచేస్తుంది.. యాప్స్ ఎంత స్మూత్ గా ఓపెన్ అవుతున్నాయి.. ఒక యాప్ నుంచి మరొక యాప్ కు మారినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుంది.. ఇవన్నీ కూడా యూజర్ ఎక్స్పీరియన్స్ ను నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఈ విషయంలో సరికొత్త అనుభూతిని అందించడానికి వివో తన origin OS 7 […]

Vivo OriginOS 7: స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కెమెరా.. బ్యాటరీ.. ప్రాసెసర్ మాత్రమే కాదు.. అందులో ఉండే సాఫ్ట్వేర్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది.. ఫోన్ ఎంత వేగంగా పనిచేస్తుంది.. యాప్స్ ఎంత స్మూత్ గా ఓపెన్ అవుతున్నాయి.. ఒక యాప్ నుంచి మరొక యాప్ కు మారినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుంది.. ఇవన్నీ కూడా యూజర్ ఎక్స్పీరియన్స్ ను నిర్ణయిస్తాయి.

ఇప్పుడు ఈ విషయంలో సరికొత్త అనుభూతిని అందించడానికి వివో తన origin OS 7 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత వెర్షన్ ను పోల్చి చూస్తే డిజైన్.. యానిమేషన్స్.. మల్టీ టాస్కింగ్.. ఫీచర్లలో అనేక మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా గ్లాస్ తరహా ట్రాన్స్ లూసెంట్ ఇంటర్ ఫేస్.. ఫ్లూయిడ్ యానిమేషన్స్ ఈ తరహా ఆపరేటింగ్ సిస్టం కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ ఆపరేటింగ్ సిస్టం పరిశీలించినప్పుడు ముందుగా కనిపించేది దాని విజువల్ అప్పీల్. సాధారణంగా ఫోన్లో స్క్రీన్ స్వైప్ చేసినప్పుడు లేదా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కనిపించే యానిమేషన్లకు భిన్నంగా.. మన చేతి వేళ్ల కదలికలకు అనుగుణంగా స్క్రీన్ మీద ఉండే ఎలిమెంట్స్ స్పందించే విధంగా రూపొందించారు.

ఇందులో ప్రధానంగా ఆకట్టుకునే అంశం డైనమిక్ ట్రాన్స్ లూసెంట్ మెటీరియల్. అంటే స్క్రీన్ పై కనిపించే కంట్రోల్ ప్యానెల్.. నోటిఫికేషన్లు.. ఇతర ఇంటర్ ఫేస్ ఎలిమెంట్స్ గాదు తరహాలో పారదర్శకంగా కనిపిస్తాయి.

వీటి వెనుక ఉన్న వాల్ పేపర్ కూడా కొంతవరకు కనిపిస్తుంది. దీనివల్ల స్క్రీన్ కు ఒక లేయర్ లుక్ వస్తుంది ముఖ్యంగా కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది .

ఈ గ్లాస్ డిజైన్ లో మూడు రకాల స్టైల్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్.. నేచురల్.. సాఫ్ట్ అనే ఆప్షన్ల ద్వారా యూజర్లు తమకు నచ్చిన విధంగా ఇంటర్ ఫేస్ రూపాన్ని మార్చుకోవచ్చు.

ఫ్లూయిడ్ యానిమేషన్స్

ఈ ఆపరేటింగ్ సిస్టంలో మరో ముఖ్యమైన మార్పు ఫ్లూయిడ్ మోషన్. ఫోన్ స్క్రీన్ మీద యూజర్ వేళ్లను వేగంగా స్వైప్ చేస్తే దానికి అనుగుణంగా ఎలిమెంట్స్ వేగంగా స్పందిస్తూ ఉంటాయి. నెమ్మదిగా కలిపితే ఈ యానిమేషన్ కూడా సహజంగా మారిపోతుంది.

దీనికి స్ప్రింగ్ యానిమేషన్ కూడా జోడించారు. అంటే ఒక బటన్ ను టచ్ చేసినప్పుడు లేదా ఒక పేజీ నుంచి మరొక పేజీకి వెళ్ళినప్పుడు ఎలిమెంట్స్ సాగే స్వభావంతో కదిలిపోతాయి. మళ్లీ అసలు స్థానానికి చేరుకుంటాయి…

ఇక డైనమిక్ లో ఫీచర్ ద్వారా స్క్రీన్ మీద వెలుతురు ప్రభావాలు కూడా యూజర్ టచ్ కు అనుగుణంగా మారిపోతుంటాయి. ఈ మార్పులు ఫోన్ ను ఉపయోగించే అనుభూతిని మరింత ఆకర్షణయంగా మార్చే విధంగా ఉంటాయి.

వివో ప్రకారం ఫ్లూయిడ్ మోషన్ 200 పైగా సందర్భాల్లో పనిచేసే విధంగా రూపొందించారు. అయితే ఈ ఫీచర్లు ఫోన్ మోడల్ బట్టి మారుతూ ఉంటాయి.

మల్టీ టాస్కింగ్ విషయంలో origin OS 7 లో మార్కులు ఉన్నాయి. Origin work bench అనే ఫీచర్ ద్వారా ఒకేసారి పలు యాప్స్ తో పనిచేసే అవకాశం కల్పించారు. ఉదాహరణకు ఒకవైపు వీడియో చూస్తూనే మరోవైపు మెసేజ్ లకు స్పందించవచ్చు. ఇంకోవైపు డాక్యుమెంట్లు పరిశీలించవచ్చు. ఇలా వేరువేరు పనుల కోసం పదే పదే యాప్స్ మారాల్సిన అవసరాన్ని తగ్గించే విధంగా ఈ ఫీచర్ ను రూపొందించారు. అనుకూలమైన యాప్స్ మధ్య డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా సమాచారాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ మల్టీ టాస్కింగ్ ఫీచర్ కొన్ని మోడల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 12gb లేదా అంతకంటే ఎక్కువ ర్యామ్ ఉన్న పరికరాలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

Origin OS 7 లో ఏఐ ఫీచర్లకు కూడా ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా జోవీ అనే అసిస్టెంట్ ద్వారా యూజర్ల రోజు వారి పనులను సులభతరం చేసేందుకు వివో ప్రయత్నాలు చేసింది.

AI recorder: సమావేశాలు, ఇంటర్వ్యూలు, క్లాసుల ఆడియోను రికార్డు చేయడంతో పాటు మాటలను టెక్స్ట్ గా మార్చి సారాంశాన్ని అందిస్తుంది.

AI search: ఫైల్ పేరు గుర్తు లేకపోయినా.. అందులో విషయాలను వివరించి వెతికే అవకాశం కల్పిస్తుంది.

Snap note: వైట్ బోర్డుపై రాసిన సమాచారం.. చేతిరాత నోట్స్.. స్లైడ్స్ ను ఎడిట్ చేసుకోగలిగితే డాక్యుమెంట్లుగా మార్చేందుకు ఉపయోగపడుతుంది.

Smart call assistant: కాల్ అందుకోలేని సమయంలో ఏ ఐ సమాధానం ఇవ్వడం.. అనంతరం కాల్ సారాంశాన్ని చూపించడం అంటే సదుపాయాలు అందిస్తుంది.

ఇవన్నీ స్మార్ట్ ఫోన్ ను కేవలం కమ్యూనికేషన్ పరికరంగా కాకుండా.. వ్యక్తిగత పనులకు ఉపయోగపడే డిజిటల్ అసిస్టెంట్గా మార్చే ప్రయత్నంలో భాగం.

Origin OS 7 ను వివో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 21న పరిచయం చేసింది. మనదేశంలో అక్టోబర్ 6న విడుదల చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఎంపిక చేసిన వివో స్మార్ట్ ఫోన్లకు ఈ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి రాబోతోంది. ఎటువంటి మోడల్స్ కు.. ఎప్పుడు అప్డేట్ వస్తుందనే వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper