Homeఅంతర్జాతీయంFlipkart Minutes: జస్ట్ పది నిమిషాల్లోనే.. ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చిన సంచలనం ఇది..

Flipkart Minutes: జస్ట్ పది నిమిషాల్లోనే.. ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చిన సంచలనం ఇది..

Flipkart Minutes: ఆన్లైన్ విధానంలో సాగే అమ్మకాల్లో అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. లక్షల కోట్ల విలువైన ఈ మార్కెట్లో ఇప్పటికే అనేక రకాల కార్పొరేట్ కంపెనీలు పాగా వేశాయి. ఈ విభాగంలో లక్షల మంది గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నారు. మన దేశంలో టాప్ కార్పొరేట్ కంపెనీలు ఈ రంగంలో వ్యాపారం సాగిస్తున్నాయి. ఆన్లైన్ వ్యాపార రంగంలో ఆన్లైన్ వ్యాపార రంగంలో ఇప్పటికే బ్లింక్ ఇట్.. జెప్టో.. స్విగ్గి ఇన్ స్టా మార్ట్ వంటి కంపెనీలు […]

Flipkart Minutes: ఆన్లైన్ విధానంలో సాగే అమ్మకాల్లో అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. లక్షల కోట్ల విలువైన ఈ మార్కెట్లో ఇప్పటికే అనేక రకాల కార్పొరేట్ కంపెనీలు పాగా వేశాయి. ఈ విభాగంలో లక్షల మంది గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నారు. మన దేశంలో టాప్ కార్పొరేట్ కంపెనీలు ఈ రంగంలో వ్యాపారం సాగిస్తున్నాయి.

ఆన్లైన్ వ్యాపార రంగంలో

ఆన్లైన్ వ్యాపార రంగంలో ఇప్పటికే బ్లింక్ ఇట్.. జెప్టో.. స్విగ్గి ఇన్ స్టా మార్ట్ వంటి కంపెనీలు వ్యవహారాలు సాగిస్తున్నాయి. లక్షల కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. ఇప్పుడు ఇందులోకి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వచ్చేసింది. తన ఈ కామర్స్ సేవలను మరింత విస్తరించడానికి ప్రాంగణం సిద్ధం చేసుకుంది. దీనికోసం ఫ్లిప్కార్ట్ మినిట్స్ అనే పేరుతో ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా కేవలం నిత్యవసర సరుకులను 10 నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసింది. ఫలితంగా మిగతా పోటీ సంస్థలకు ఫ్లిప్కార్ట్ గట్టి సంకేతాలు పంపించింది.

విపరీతమైన డిమాండ్ ఉంది

ఆన్లైన్ మార్కెట్లో పండ్లు.. కూరగాయలు.. పాలు.. ఇతర నిత్యావసరాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. పైగా నగరాలలో చాలామంది సమయం వెచ్చించి నిత్యాసరాలను కొనుగోలు చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారిని దృష్టిలో పెట్టుకొని అన్ని సరుకులను ఫ్లిప్కార్ట్ అందించబోతోంది. ఫ్లిప్కార్ట్ నివేదించిన వివరాల ప్రకారం స్నాక్స్.. క్లీనింగ్ ఉత్పత్తులు.. స్మార్ట్ వాచ్లు.. గాడ్జట్లు ఇందులో ఆర్డర్ చేయవచ్చు. కేవలం ఆర్డర్ చేసిన పదినిమిషాల్లోనే కస్టమర్లకు సేవలు అందిస్తామని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. అంతేకాదు అనేక రకాల ఉత్పత్తుల మీద ప్రత్యేకమైన డిస్కౌంట్లు కూడా అందిస్తున్నామని వివరించింది. గతంలో ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా ఒక సెక్షన్ లో ఫ్లిప్కార్ట్ మినిట్స్ సేవలను ఉచితంగా అందించింది. ఇప్పుడు తన కస్టమర్లకు మరింత సులభంగా సేవలు అందించడానికి యాప్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో 130 కి పైగా నగరాలలో ఏకంగా వెయ్యికి పైగా డార్క్ స్టోర్ ఈ కంపెనీ ఏర్పాటు చేసింది. అంతేకాదు తన సేవలను విస్తృతంగా అందించడానికి ఏర్పాటు చేసుకుంది..

అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం

ఆన్లైన్ డెలివరీ విభాగంలో అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంది. ఈ రంగంలో లక్షల కోట్ల వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఇప్పటికి ఇన్ని రకాలుగా కంపెనీలు ఉన్నప్పటికీ ఇంకా వ్యాపారం సాగించడానికి స్కోప్ ఉంది. అందువల్లే ఫ్లిప్కార్ట్ ఈ రంగంలోకి వచ్చింది. భారీగానే పెట్టుబడి పెట్టింది. చాలామందిని రిక్రూట్ చేసుకుంది. తద్వారా పోటీ సంస్థలకు గట్టి సంకేతాలు పంపించింది. ఫ్లిప్కార్ట్ రాకతో మిగతా సంస్థలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ సంస్థకు డార్క్ స్టోరేజీలు చాలా ఉన్నాయి. అందువల్లే ఈ రంగంలో పోటీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper