Flipkart : స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే ఇది ఓ మంచి అవకాశం. ప్రస్తుతం ఈ-కామర్స్ వేదికలపై భారీ సేల్ నడుస్తోంది. దీనిలో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏయే స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలో కొనొచ్చో..వేల రూపాయలు ఎలా ఆదా చేయవచ్చో తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్, వన్‌ప్లస్, శామ్‌సంగ్, నథింగ్, రియల్‌మీ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు లభిస్తోంది.
Also Read : భారతీయ బైక్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. నేపాల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హవా!
నథింగ్ ఫోన్ (3ఎ) ప్రో
నథింగ్ (3ఎ) ప్రో స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో లభిస్తోంది. సాధారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.32,999 కానీ మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి డిస్కౌంట్‌తో కేవలం రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్డు నో కాస్ట్ ఈఎంఐ ఆఫ్షన్ కూడా అందిస్తోంది. ఒకేసారి మొత్తం చెల్లించలేని వారు వాయిదాలలో కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు కావాలనుకుంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు సెలక్ట్ చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద చెల్లించే వారికి 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రత్యేక ఆఫర్‌లో మీరు రూ.3,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
రియల్‌మీ పి3 ప్రో 5జీ
రియల్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్ మీకు ఈఎంఐపై లభిస్తోంది. మీరు నెలకు రూ.4,000 ఈఎంఐ చెల్లించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999కి అందుబాటులో ఉంది. మీరు దీన్ని మరింత తక్కువ ధరకు కొనాలనుకుంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ కూపన్ ద్వారా మీకు రూ.5,000 వరకు లాభం కూడా పొందవచ్చు. అయితే ఇది కొన్ని సెలక్ట్ చేసిన లావాదేవీలపై మాత్రమే అందుబాటులో ఉంది.
రెడ్‌మీ నోట్ 14 ప్రో+
రెడ్‌మీ నోట్ 14 ప్రో+ను మీరు ఫ్లిప్‌కార్ట్ నుండి రూ.29,999కి కొనుగోలు చేయవచ్చు. దీనిపై మీకు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనం కూడా లభిస్తుంది. మీరు ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేకపోతే ఈఎంఐ ఆఫ్షన్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో మీకు త్రి కలర్ ఆఫ్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మీరు అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లను కూడా తక్కువ ధరలో కొనుగోలు చేసే ఛాన్స్ ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. మీరు డిస్కౌంట్, ఈఎంఐ ద్వారా ప్రీమియం ఫోన్‌ల వైపు కూడా చూడవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది.
Also Read : ఎండల్లో హాయ్ హాయ్..రూ.5000 లోపు లభించే 5 ఎయిర్ కూలర్లు!