Yamaha YZF R2: నేటి కాలంలో ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు యువతను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తున్నాయి. యువతను ఆకట్టుకునే విధంగా ద్విచక్ర వాహనాలను తయారుచేసే సంస్థలలో సుజుకి ముందు వరుసలో ఉంటుంది. నేటి కాలానికి అనుగుణంగా యమహా సంస్థ అత్యున్నత స్థాయిలో ఒక బైక్ తీసుకొచ్చింది. కేవలం యంగ్ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ రూపొందించింది.
యమహా మోటార్ ఇండియా యువత కోసం ఆర్ సిరీస్ లో అనేక రకాలుగా బైక్ లు రూపొందించింది. తాజాగా YZF R2 అనే మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర 2.30 లక్షలు గా పేర్కొంది. ఇందులో టాప్ వేరియంట్ R2 ఎం ధరను 2.53 లక్షలు గా నిర్ణయించింది. అయితే ఈ ధర కేవలం ఢిల్లీ ఎక్స్ షోరూం లో మాత్రమే.. మిగతా షోరూంలో ధరలు వేరే విధంగా ఉంటాయి. ఈ బైక్ డెలివరీలు సెప్టెంబర్ నుంచి మొదలు కాబోతున్నాయి.
ఈ సిరీస్లో అత్యంత తేలికైన ద్విచక్ర వాహనాలను యమహా సంస్థ రూపొందించింది. మొత్తంగా దీని బరువు 104 కిలోలు. 810 మిల్లీమీటర్ల ఎత్తులో సీటును ఏర్పాటు చేసింది. 17 అంగుళాల పరిమాణంలో వీల్స్ రూపొందించింది. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన 204 సిసి లిక్విడ్ కూల్డ్.. సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 26. 1 Ps power, 19.1 Nm Tark ను విడుదల చేస్తుంది. దీనికి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ స్టాండర్డ్ గా రూపొందించారు. దీని ముందు భాగంలో 282 ఎం ఎం డిస్క్ బ్రేక్ ఉంది. బైక్ చుట్టూ ఆల్ ఎల్ఈడి లైటింగ్ ఉంది
ఇందులో రైడర్ తన అవసరానికి తగ్గట్టుగా ఎంచుకునే స్ట్రీట్.. రెయిన్.. స్పోర్ట్స్.. కష్టం అనే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. టాప్ వేరియెంట్ R2M లో అదనంగా టి ఎఫ్ టి స్క్రీన్.. స్మార్ట్ కీ వంటి అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఈ బైక్ ను మిడ్, R 2M అనే రెండు వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది.. డార్క్.. బ్లూయిష్ గ్రే.. మ్యాట్ వైట్ పెర్ల్, మెటాలిక్ బ్లాక్, రేసింగ్ బ్లూలో లభిస్తుంది. మెటాలిక్ గ్రే టాప్ వేరియెంట్ లో మాత్రమే అత్యంత లిమిటెడ్ ఎడిషన్ గా ఉంది.
.@India_Yamaha YZF-R2 – Will You Buy This Over The R15? | Walkaround | OVERDRIVE#Yamaha #YamahaYZFR2 pic.twitter.com/G0zFWhU8qY
— OVERDRIVE (@odmag) September 8, 2026