India Business: నెత్తి మాసిన ట్రంప్ ఇండియా గురించి ఏదేదో మాట్లాడుతుంటాడు. పనికిమాలిన పాకిస్తాన్ అధిపతి ఇండియా గురించి తెలుసుకోక పిచ్చివాగుడు వాగుతుంటాడు. చైనా, సౌదీ అరేబియా.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మంది.. ఏ ఒక్కడికి తలా ఉండదు. తోక అంతకన్నా ఉండదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో.. రకరకాల సమస్యలలో చిక్కుకుంటే.. ఇండియా మాత్రం ఏకంగా లక్ష కోట్ల వ్యాపారం, 25 లక్షల ఉద్యోగాలతో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
ప్రతి ఏడాది దసరా సందర్భంగా ఆమెజాన్, ఫ్లిప్కార్ట్ సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తుంటాయి. పైగా భారత్ అనేది అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ కావడంతో.. ఈ పండుగ అతిపెద్దది కావడంతో.. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి మొదలు పెడితే టీవీల వరకు బంపర్ డిస్కౌంట్ ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం జీఎస్టీ లో కూడా ప్రభుత్వం వెసలు బాటు ఇవ్వడంతో అన్ని వస్తువుల ధరలు చాలావరకు తగ్గాయి. దీనికి తోడు కంపెనీలు ఆఫర్లు ప్రకటించడంతో మరింత తగ్గాయి. ఫలితంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ పండగ చేసుకుంటున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ సీజన్లో అతిపెద్ద అమ్మకాల పండగ మొదలుపెట్టాయి.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్ల పండుగ మొదలుపెట్టాయి. దీంతో మనదేశంలో ఉన్న ఈ సంస్థల కార్యాలయాలు వార్ రూమ్ లను తలపిస్తున్నాయి. ఈ సీజన్లో ఏకంగా 25 లక్షల మంది ఉద్యోగులు ఈ సంస్థలలో పని చేయనున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 1.2 ట్రిలియన్ ఆమకాల జరుగుతాయని అంచనా. మొత్తంగా లక్ష కోట్ల వ్యాపారం సాగుతుందని సమాచారం. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమ్మకాల జాతర మొదలవుతుందని.. ఇది ఈ పండుగ వరకు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ కావడం.. ఈ కామర్స్ సైట్లు ఆఫర్లు ప్రకటిస్తుండడంతో.. దండిగా వ్యాపారం సాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.