Homeఅంతర్జాతీయంiPhone 18: మిగతా వాటి మాదిరిగా కాదు..ఇవీ ఐఫోన్ ప్రత్యేకతలు..అందుకే అంత క్రేజ్

iPhone 18: మిగతా వాటి మాదిరిగా కాదు..ఇవీ ఐఫోన్ ప్రత్యేకతలు..అందుకే అంత క్రేజ్

iPhone 18: చాలామంది ఐఫోన్ కొనుగోలు చేయడాన్ని.. ఐఫోన్ చేతిలో పెట్టుకోడాన్ని స్టేటస్ సింబల్ లాగా భావిస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ ఈఎంఐ పద్ధతిలో అయినా సరే ఐఫోన్ కొనుగోలు చేస్తుంటారు. ఐఫోన్ కొత్త సిరీస్ మార్కెట్లోకి విడుదలయితే చాలు. దానిని తగ్గించుకోవడానికి స్టోర్లో ముందు ఉదయాన్నే బారులు తీరుతారు.. సగం కొరికిన ఆపిల్ పండు లాంటి ఐఫోన్ అంటే ఎందుకంత ప్రత్యేకం.. దానివల్ల స్టేటస్ సింబల్ పెరుగుతుందా.. సేఫ్టీ బాగుంటుందా.. ఐఫోన్ అంటే చాలా […]

iPhone 18: చాలామంది ఐఫోన్ కొనుగోలు చేయడాన్ని.. ఐఫోన్ చేతిలో పెట్టుకోడాన్ని స్టేటస్ సింబల్ లాగా భావిస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ ఈఎంఐ పద్ధతిలో అయినా సరే ఐఫోన్ కొనుగోలు చేస్తుంటారు. ఐఫోన్ కొత్త సిరీస్ మార్కెట్లోకి విడుదలయితే చాలు. దానిని తగ్గించుకోవడానికి స్టోర్లో ముందు ఉదయాన్నే బారులు తీరుతారు..

సగం కొరికిన ఆపిల్ పండు లాంటి ఐఫోన్ అంటే ఎందుకంత ప్రత్యేకం.. దానివల్ల స్టేటస్ సింబల్ పెరుగుతుందా.. సేఫ్టీ బాగుంటుందా.. ఐఫోన్ అంటే చాలా స్పెషల్ అని ఎందుకు అంటారు.. ఐఫోన్ 18 సిరీస్ (iPhone 18) మార్కెట్లోకి విడుదలైన నేపథ్యంలో.. దాని ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిస్తే..

అప్లికేషన్లు..

యూసర్లు ఐఫోన్ కొనుగోలు చేయడానికి ముందు అందులో చూసేవి అప్లికేషన్లు. ఐఫోన్ లో యాప్ స్టోర్ లో యాప్ లకు బదులు అద్భుతమైన సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి అప్లికేషన్ ను ఆపిల్ కంపెనీ అత్యంత క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉంటుంది. మాల్ వేర్ లేదా.. ప్రమాదకరమైన కోడ్ లేదని నిద్దరించుకుని అనంతరం స్టోర్ లోకి యాప్స్ తీసుకొస్తారు. యాప్ లు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే కచ్చితంగా యూజర్లు అనుమతించాలి. అందువల్లే డెవలపర్లు ముందుగా ఈ యాప్ స్టోర్ కోసమే అప్లికేషన్లను తయారు చేస్తారు.

అద్భుతమైన బ్యాటరీ

ఆపిల్ కంపెనీకి సంబంధించి హార్డ్వేర్.. సాఫ్ట్వేర్ మొత్తం దాని చేతిలోనే ఉంటాయి. ఫోన్లలో చాలా స్థిరమైన.. వేగవంతమైన స్పందన ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్.. షీట్ మేనేజ్మెంట్ వంటివి మిగతా ఫోన్లతో పోల్చి చూస్తే అత్యంత మెరుగ్గా ఉంటాయి. ఆపిల్ కంపెనీ ప్రాసెసర్ల విషయంలో.. మైక్రో చిప్ల విషయంలో సొంతంగా తయారీ బాధ్యతను.. డిజైన్ ను చేపడుతుంది. అందువల్లే ఆపిల్ కంపెనీ తన ఐఫోన్లకు ఏడు సంవత్సరాలు పాటు అప్డేట్లు అందిస్తూ ఉంటుంది. సపోర్ట్ కూడా చేస్తూ ఉంటుంది. అందువల్లే పాత ఐఫోన్ అయినా సరే రీసెట్ చేస్తే కొత్త దాని మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది.

భద్రత

ఐఫోన్ లో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఈ విషయంలో అనేక రకాలుగా సమస్యలు ఎదురైనప్పటికీ ఆపిల్ దానిని పరిష్కరించింది. భద్రమైన ఆప్షన్ లాగా ఫేస్ ఐడిని అందుబాటులో తీసుకొచ్చింది. ఐఫోన్ లో యాపిల్ ఐడి అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఐడి ద్వారా ఆపిల్ ఎకో సిస్టం.. డివైస్ వంటికి యూజర్ ఖాతా లింక్ అవుతూ ఉంటుంది. సెక్యూర్ ఎన్ క్లేవ్ ఫీచర్ వల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. ఒకవేళ ఫోన్ లో ఏదైనా మాల్వేర్ ప్రవేశించడం.. ఇతర వ్యక్తులు ప్రవహించినట్టు కనిపిస్తే.. ప్రాసెసర్ మెయిన్ ప్రాసెసర్ నుంచి విడిపోతుంది. దీనివల్ల వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కదు.

సమాచారం షేర్ చేసుకోవచ్చు

ఐఫోన్ వాడే యూసర్లు యాపిల్ ఎకో సిస్టం ద్వారా.. తమ సమాచారాన్ని ఆపిల్ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులకు పంపించవచ్చు. ఐఫోన్ నుంచి మాక్ బుక్, ఐపాడ్ డివైస్లకు సులభంగా పంపించవచ్చు. సమాచారాన్ని చేరు కూడా చేసుకోవచ్చు. ఆపిల్ ఐడి సహాయంతో ఒక డివైస్ లో నిలిపి వేసిన పనిని.. మరో డివైస్ లో కొనసాగించవచ్చు. ఐఫోన్లో కెమెరా క్వాలిటీ ఒక రేంజ్ లో ఉంటుంది.

ఆపిల్ కంపెనీ ట్రేడ్ ఇన్ పాలసీని యూజర్లకు అనుకూలంగా చేస్తూ ఉంటుంది. దీనివల్ల తమ పాత ఫోన్ లను ఆపిల్ కంపెనీకి సంబంధించిన ఏ దుకాణంలోనైనా సరే అమ్మవచ్చు. లేదా మెయిల్ ద్వారా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రీసైక్లింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఐఫోన్లకు రీసేల్ విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా బ్రహ్మాండమైన ధర లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యూజర్ల హెల్త్ స్టేటస్ కు సంబంధించిన కొన్ని రకాల ఫ్యూచర్లు ఐఫోన్ లో ప్రత్యేకంగా ఉంటాయి.

ఇన్ని రకాలుగా ఫ్యూచర్లు ఉన్నప్పటికీ ఐఫోన్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటి ధర మిగతా వాటితో పోల్చి చూస్తే అధికం. ఇందులో మెమరీ కార్డు వేయడానికి అవకాశం ఉండదు. ఫోన్ కష్టమైజేషన్ చేసుకోవడానికి సాధ్యం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా చార్జర్.. కేబుల్ వైరు వేరుగా కొనుగోలు చేయాల్సిందే. దానిని ఎట్టి పరిస్థితుల్లో ఆపిల్ కంపెనీ ఉచితంగా ఇవ్వదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper