iPhone 18 Pro: ఆపిల్ కంపెనీ నుంచి అందరూ అంచనా వేసినట్టుగానే ఐఫోన్ 18 ప్రో మోడల్ ద్వారా టెక్నాలజీ మొత్తాన్ని మడత పెట్టింది. తాను రూపొందించిన ఫోన్లో ఇంతవరకు ఫోల్డబుల్ నమూనాను ఆపిల్ ఇంతవరకు మార్కెట్లోకి తీసుకురాలేదు. కానీ తొలిసారి మడత పెట్టే ఫోన్ ను తీసుకొచ్చి సంచలనానికి నాంది పలికింది..
ఐఫోన్ డ్యూయో, ఐఫోన్ 18 సిరీస్ ను ఆపిల్ ప్రపంచానికి బుధవారం పరిచయం చేసింది. కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ లో జరిగిన సర్ప్రైజ్ అండ్ షైన్ కార్యక్రమంలో ఆపిల్ కంపెనీ సీఈవో జాన్ టెర్నెస్ ఆపిల్ నూతన ఉత్పత్తుల వివరాలను ప్రకటించారు. ఈ ఫోన్లు స్టార్ వైట్.. నైట్ స్కై రంగులలో లభ్యం అవుతాయి.. ఇక మడత పెట్టే ఫోన్.. దానిని విప్పినప్పుడు అత్యంత పల్చటి ఐఫోన్ లాగా మారిపోతుంది. దీనికోసం ఐఓఎస్ 27 ను రీ డిజైన్ చేశారు. 7.6 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డి ఆర్ డిస్ ప్లే (మడత తీసినప్పుడు) రెండు హోం స్క్రీన్ పేజెస్, మెయిల్, మెసేజెస్ పంపి కంటెంట్ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక రెండు అప్లికేషన్లను పక్క పక్కన ఒకేసారి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ మడత పెట్టినప్పుడు (5.4 అంగుళాలు) బెడ్ సైడ్ క్లాక్ (విడ్జెట్స్, వెదర్, క్యాలెండర్, మ్యూజిక్) లాగా వాడుకోవచ్చు.
ఐఫోన్ 18 ప్రో
ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మోడళ్లు మనదేశంలో 256 జీబీ, 512 జిబి, 1 టీబీ, 2 టీబీ స్టోరేజీలలో లభిస్తుంటాయి. సిల్వర్.. గ్లేషియర్ బ్లూ.. డీప్ బ్లాక్.. బర్గుండి వంటి రంగులలో ఈ ఫోన్ లభిస్తాయి.
6.3 అంగుళాల పరిమాణంలో ఉన్న ఈ ఫోన్లో ఏఐ ఆధారిత సిరి అందుబాటులో ఉంది.
ఇమేజ్ విషయంలో ప్లేగ్రౌండ్ వంటి ఏ ఐ టూల్స్ ను ఆపిల్ ఇందులో పొందుపరిచింది.
ఏ 20 ప్రో చిప్, 7 కోర్ జి పి యు, 6 కోర్ సిపియు వల్ల ఈ ఫోన్ సామర్థ్యం మరింత ఎక్కువగా ఉంటుంది.
36 గంటల పాటు వీడియో ప్లే బ్యాక్ సామర్థ్యం.. 15 నిమిషాల్లోనే 50% చార్జింగ్ పొందే సామర్థ్యం.. ఒక ఛార్జింగ్ తోనే 24 గంటల వినియోగం వంటి సౌలభ్యాలు ఇందులో ఉన్నాయి.
48 ఎంపీ ఫ్యూజన్ మెయిన్ కెమెరాలో ఆస్ట్రో ఫోటోగ్రఫీ.. నైట్ మోడ్ మరింత మెరుగ్గా కనిపిస్తుంటాయి. 4కె రిజల్యూషన్, డాల్బీ విజన్, హెచ్డిఆర్లో టైం లాప్స్, ప్రో కంట్రోల్స్, యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్
6.9 అంగుళాల పరిమాణంలో ఐఫోన్ ప్రో మాక్స్ అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 18 ప్రోలో ఫీచర్లు మరింత విస్తృతంగా ఉంటాయి. ఇందులో ఒక చార్జింగ్ తోనే 30 గంటల పాటు ఫోన్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 45 గంటల పాటు వీడియో ప్లే బ్యాక్ వంటి సౌలభ్యం ఉంటుంది.
ఎయిర్ పాడ్స్
ఓపెన్ ఇయర్ డిజైన్ తో ఇది రూపొందింది. అం క్రితం ఎయిర్ పాడ్స్ తో పోసి చూస్తే బయట శబ్దాలను తగ్గించారు. లైవ్ ట్రాన్స్లేషన్.. సిరి వంటి ఇతర ఇంటిలిజెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటిని హాండ్స్ ఫ్రీ మోడ్ లో కూడా వాడుకోవచ్చు. కెమెరా రిమోట్.. వ్యాల్యూమ్ స్వైప్ వంటి ఫ్యూచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఆపిల్ వాచ్ 12.. వాచ్ అల్ట్రా 4
ఇందులో ఏఐ ఆధారిత ఆడియో ఫీచర్లు ఉన్నాయి. లైవ్ రివైండ్ ఫీచర్లో 15 సెకండ్లకు సంబంధించిన ముందు సంభాషణ కూడా లభిస్తుంది. ఇందులో సరికొత్త హెల్త్ సెన్సార్ వ్యవస్థ ఉంది. మెరుగైన ఈసీజీ.. ఆప్టికల్ సెన్సింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ప్రతి ఐదు సెకండ్లకు ఒకసారి హృదయ స్పందన నమోదు అవుతూ ఉంటుంది. క్రితంతో పోల్చి చూస్తే ఇది 60 రెట్లు ఎక్కువ. నిద్ర.. శరీరంలో ఉన్న రక్తం.. వంటి వాటి డేటాను వాస్తవ వయసుతో.. వాస్తవ ఆరోగ్య సంకేతాల పోలికను కూడా ఇది అందిస్తూ ఉంటుంది.
ధరలు ఇలా
ఐఫోన్ 18 ప్రో
256 జిబి 1,64,900
512 జిబి 1,89,900
1 టీబీ 2,39,900
2 టీబీ 3,14,900
ఐఫోన్ 18 ప్రో మాక్స్
256 జిబి 1,79,900
512 జిబి 2,04,900
1 టీబీ 2,54,900
2 టీబీ 3,29,900
ఐఫోన్ డ్యూయో
256 జిబి 2,99,900
512 జీబీ 3,24,900
1 టీబీ 3,74,900
2 టీబీ 4,49,900
From iPhone Duo, iPhone 18 Pro, and iPhone 18 Pro Max to Apple Watch Series 12, Apple Watch Ultra 4, and AirPods 5… here's a look at all of the latest announcements dropping today! #AppleEvent pic.twitter.com/YvswtNEA7m
— Tim Cook (@tim_cook) September 9, 2026
Photos and videos leaked from a Dubai Apple Store just before the Apple iPhone launch event. pic.twitter.com/KP59Tq4Ge4
— Aman (@amanobviously) September 9, 2026
Photos and videos leaked from a Dubai Apple Store just before the Apple iPhone launch event. pic.twitter.com/KP59Tq4Ge4
— Aman (@amanobviously) September 9, 2026