Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: సూర్య వంశీ ని ఆటాడుకుంటున్నారు..ఇదేం ర్యాగింగ్ రా అయ్యా..

Vaibhav Suryavanshi: సూర్య వంశీ ని ఆటాడుకుంటున్నారు..ఇదేం ర్యాగింగ్ రా అయ్యా..

Vaibhav Suryavanshi: టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ అంచనాలకు మించి ఆడటం లేదు. సూపర్ బ్యాటింగ్ చేయడం లేదు. ఐపీఎల్ తరహాలో పరుగుల ప్రవాహం కొనసాగించడం లేదు. ఇలా వస్తున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు.. ఐరిష్ సిరీస్ కు ఎంపికైనప్పటికీ.. సూర్య వంశీకి మేనేజ్మెంట్ జట్టులో చోటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ లో అతనికి అవకాశం వచ్చింది. ఇచ్చిన అవకాశాన్ని అతడు వినియోగించుకోలేకపోతున్నాడు. వరుసగా అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు. ఐపీఎల్ లో సూర్య […]

Vaibhav Suryavanshi: టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ అంచనాలకు మించి ఆడటం లేదు. సూపర్ బ్యాటింగ్ చేయడం లేదు. ఐపీఎల్ తరహాలో పరుగుల ప్రవాహం కొనసాగించడం లేదు. ఇలా వస్తున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు.. ఐరిష్ సిరీస్ కు ఎంపికైనప్పటికీ.. సూర్య వంశీకి మేనేజ్మెంట్ జట్టులో చోటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ లో అతనికి అవకాశం వచ్చింది. ఇచ్చిన అవకాశాన్ని అతడు వినియోగించుకోలేకపోతున్నాడు. వరుసగా అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు.

ఐపీఎల్ లో సూర్య వంశీ పెద్ద పెద్ద బౌలర్లను సైతం ఇబ్బంది పెట్టాడు. సునాయాసంగా సిక్సర్లు కొట్టాడు. పరుగుల ప్రభావం కొనసాగించి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కానీ అదే జోరు ఇంగ్లాండ్ సిరీస్ లో చూపించలేకపోతున్నాడు. ఫోర్ లేదా సిక్సర్ కొట్టి వెంటనే అవుట్ అవుతున్నాడు. పదునైన బంతులను ఎదుర్కోలేకపోతున్నాడు. అతడి లోపానికి గమనించిన ఇంగ్లీష్ బౌలర్లు.. పదే పదే అదే తరహా బంతులు వేసి అతడిని అవుట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య వంశీ మీద సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

సూర్యవంశీ కేవలం ప్లాట్ మైదానాల మీద మాత్రమే ఆడతాడని.. ఇంగ్లీష్ గ్రీన్ పిచ్ ల మీద ఆకట్టుకోలేడని.. అతడికి ఆడ టం సాధ్యం కాదని.. సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు ప్రశ్నిస్తున్నారు. ప్లాట్ మైదానాల మీద సూర్య వంశీ ఆడే తీరును.. ఇంగ్లీష్ మైదానాల మీద ఆడే తీరును వివరిస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. సూర్యవంశీ ఆటతీరు పట్ల దెప్పి పొడిచే విధంగా ఉన్నాయి. ఈ వీడియోలు ఒకవేళ సూర్య వంశీ కంటపడితే ఎలా ఉంటుంది.. ఇటీవల ట్రై సిరీస్లో శ్రీలంక ప్లేయర్లు అతడిని రెచ్చగొట్టారు. దీంతో అతడు రెచ్చిపోయి ఫైనల్ మ్యాచ్లో అదరగొట్టాడు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ అభిమానులు సూర్య వంశీ ఆట తీరును ఎగతాళి చేస్తున్నారు. ఈ వీడియో చూసిన అతడు చివరి టి20 మ్యాచ్లో రెచ్చిపోతే.. ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు కనిపిస్తాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో.. సూర్య వంశీ ఫామ్ లోకి వస్తే అలానే ఉంటుందని.. అలాంటప్పుడు అతడిని గెలకకపోవడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper