Vaibhav Suryavanshi: మొత్తానికి టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీకి ఆడే అవకాశం లభించింది. ఇషాన్ కిషన్ గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానంలో రెండో మ్యాచ్లో సూర్య వంశీకి మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. దీంతో అందరి ఫోకస్ ఆ బుడ్డోడి మీద ఉంది.
సూర్య వంశీ, అభిషేక్ శర్మ కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోందని జాతీయమీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ వన్ డౌన్ లో ఆడే అవకాశం ఉంది.. అయ్యర్.. తిలక్ వర్మ.. నితీష్ కుమార్ రెడ్డి.. నమన్ దీర్, అక్షర్ పటేల్ వరకు టీమిండియా కు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది..
రెండో మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఫిలిప్స్ 70 పరుగులు చేశాడు. జాకబ్స్ 58 పరుగులు చేశాడు. ఓపెనర్లు సెల్ ఫెర్ట్ 7, అలెన్ 16, మిచెల్ 6 పరుగులు చేశారు. శాంట్నర్ 4*, బ్రేస్ వెల్ 10* పరుగులు చేశారు. టీమిండియాలో భువనేశ్వర్ కుమార్ ఒకటి.. అర్ష్ దీప్ సింగ్ 2, నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ సాధించారు.
181 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగుతున్న టీమ్ ఇండియాకు ఓపెనర్ గా వచ్చి వైభవ్ సూర్య వంశీ అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో అతని పేరును ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. సూర్య వంశీ ఐపీఎల్ లో అదరగొట్టాడు. ఆ తర్వాత టి20 జట్టులోకి ప్రవేశించాడు. గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డమీద అతడు తన స్థాయి నిరూపించుకోవాలని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ కోచ్ గౌతమ్ గంభీర్ అతడికి అనేక సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సూర్య వంశీ తన స్థాయి బ్యాటింగ్ చేయాలని.. టీమిండియాకు రెండవ విజయాన్ని అందించాలని అభిమానులు కోరుతున్నారు.
సూర్యవంశీ ఓపెనర్ గా బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటుంటే.. గౌతమ్ గంభీర్ మాత్రంమరో ఆలోచన చేశాడు. సూర్యవంశీ కాకుండా సంజుశాంసన్ , అభిషేక్ శర్మను ఓపెనర్లుగా పంపించాడు. కివీస్ గడ్డ మీద తొలి మ్యాచ్ లో వీరిద్దరూ అదరగొట్టారు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా సూర్యవంశీని ఓపెనర్ గా కాకుండా వన్ డౌన్ ఆటగాడిగా పంపించే అవకాశం ఉంది..