Abhishek Sharma: 35 బంతుల్లో నే సెంచరీ.. టీమ్ ఇండియాను గెలిపించాడు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే.. టి20 ట్రోఫీ దక్కే విధంగా చేశాడు. ప్రధాన మీడియా నుంచి మొదలుపెడితే సోషల్ మీడియా వరకు అభిషేక్ శర్మ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. వాస్తవానికి ఏ ఆటగాడు అయినా సరే ఇటువంటి అభిమానాన్ని చూరగొంటాడు. ఇటువంటి ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తుంటాడు.
ఈ విషయంలో మాత్రం తన కోచ్ యువరాజ్ మాత్రం సంతోషంగా లేడు. తన శిష్యుడు భీకరంగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ.. వీర విహారం అనే పదానికి సరికొత్త అర్ధాన్ని చెబుతున్నప్పటికీ ఎందుకో యువరాజ్ లో అంత గొప్ప అనుభూతి కనిపించడం లేదు.
2007లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టు మీద యువి కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు ఆ రికార్డును ఏ ఆటగాడు కూడా అధిగమించలేకపోయాడు. ఆ రికార్డుకు దరిదాపుల్లోకి వచ్చినప్పటికీ.. దాన్ని మాత్రం సాధించలేకపోయారు. ఇదే విషయాన్ని యువి ప్రస్తావించాడు.. కివీస్ మీద కేవలం 14 బంతుల్లోనే తన శిష్యుడు హాఫ్ సెంచరీ చేశాడు. ఒక రకంగా ఇది రికార్డు అయినప్పటికీ.. యువి రికార్డు మాత్రం బద్దలు కాలేదు.. ఇదే విషయాన్ని శర్మ గురువు ప్రస్తావించాడు. నా ఘనతను అధిగమించడం సులువు కాదు.. అంటూ ఒక ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తన శిష్యుడు చేసిన సెంచరీని ప్రస్తావిస్తూ..” నేను 30 లేదా 34 బంతుల్లో 100 పరుగులు చేయలేను. బాగా ఆడారు సార్.. గ్రేట్ ఇన్నింగ్స్.. కనీసం అప్పుడప్పుడు సింగిల్స్ తీస్తూ ఉండండి. మరోవైపు వైభవ్ ద్వారా మంచి అద్భుతాలు జరిగాయి. ఇది వినాశకరమైన కలయిక. హాట్సాఫ్ టు సంజూ శాంసన.. వన్ డౌన్ లో వచ్చి పూర్తి జట్టు సభ్యుడిగా ఆడుతున్నారు. టెయిల్ ఎండర్లు కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు” అంటూ యువి వ్యాఖ్యానించాడు.
యువి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. అయితే ఇటువంటి చరిత్రలో భారత జట్టు తరుపున అత్యంత వేగవంతమైన అర్థ శతకం యువరాజ్ పేరు మీద ఉంది. ఆ తర్వాత అభిషేక్ శర్మ పద్నాలుగు, పదిహేను బంతులలో అర్ధ శతకాలు చేశాడు. గురువును మించిన శిష్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో అభిషేక్ మొదటి రెండు మ్యాచ్లలో తన స్థాయి ఆటతీరు ప్రదర్శించలేదు. కానీ మూడో మ్యాచ్లో మాత్రం దుమ్మురేపాడు. అదిరి పోయే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. తనను అభి “షేర్” అని ఎందుకు పిలుస్తారు మరోసారి నిరూపించాడు.
You still can’t get 50 of 12 can you @OfficialAbhi04! Looks like two left handers batting in their backyard!
#IndVsNZ
— Yuvraj Singh (@YUVSTRONG12) October 27, 2026