Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ పరిస్థితి ఏంటి.. రెండో మ్యాచ్ లోనూ "ఆఅ"కే పరిమితమా..

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ పరిస్థితి ఏంటి.. రెండో మ్యాచ్ లోనూ “ఆఅ”కే పరిమితమా..

Vaibhav Suryavanshi: సంజు సరిగా ఆడటం లేదు. టెక్నిక్స్ మార్చుకోవడం లేదు. అదేవిధంగా పదేపదే ఆడుతూ వికెట్ పడేసుకుంటున్నాడు. ఓపెనర్ గా రంగంలోకి వస్తున్న అతడు.. పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. నిర్లక్ష్యమైన బ్యాటింగ్ తో అయితే సున్నా.. లేకుంటే ఒక పరుగు మాత్రమే చేసి వెళ్ళిపోతున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సరిగ్గా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నప్పటికీ.. జట్టు అవసరాల దృష్ట్యా అతడు భీకరంగా ఆడలేక పోతున్నాడు. కేవలం తన వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రమే ఆడుతున్నట్టు […]

Vaibhav Suryavanshi: సంజు సరిగా ఆడటం లేదు. టెక్నిక్స్ మార్చుకోవడం లేదు. అదేవిధంగా పదేపదే ఆడుతూ వికెట్ పడేసుకుంటున్నాడు. ఓపెనర్ గా రంగంలోకి వస్తున్న అతడు.. పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. నిర్లక్ష్యమైన బ్యాటింగ్ తో అయితే సున్నా.. లేకుంటే ఒక పరుగు మాత్రమే చేసి వెళ్ళిపోతున్నాడు.

తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సరిగ్గా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నప్పటికీ.. జట్టు అవసరాల దృష్ట్యా అతడు భీకరంగా ఆడలేక పోతున్నాడు. కేవలం తన వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రమే ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో రెండవ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. తిలక్ వర్మ మీద విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అతడు బ్యాటింగ్ చేసిన విధానం అత్యంత నిదానంగా ఉంది. అతడు నిదానంగా బ్యాటింగ్ చేయడం వల్లే చేయాల్సిన పరుగులు పెరిగిపోయాయి. తదుపరి బ్యాటర్ల మీద ఒత్తిడి పెరిగింది.

ఇషాన్ కిషన్ కూడా అంత గొప్పగా ఆడటం లేదు. ఐపీఎల్ లో పోటాపోటీగా పరుగులు చేసిన అతడు. ఐర్లాండ్ సిరీస్లో ఫ్లాప్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అన్ని వేళ్ళు అతడిని చూపిస్తున్నాయి. ఇంకా ఎందుకు అతడికి జట్టులో చోటు కల్పిస్తున్నారని సీనియర్ ప్లేయర్లు విమర్శలు చేస్తున్నారు. సంజు.. కిషన్ కు పదేపదే అవకాశాలు ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టి20 వరల్డ్ కప్ గెలవడానికి కారణమైనంతమాత్రాన సంజు ను ఇంకా ఎన్నిసార్లు మోస్తారని మేనేజ్మెంట్ ను ఉద్దేశించి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంజు కోసం సూర్య వంశీని ఆటలో అరటిపండుగా మార్చేస్తున్నారని మండిపడుతున్నారు.

సంజును పక్కనపెట్టి.. వైభవ్ సూర్య వంశీకి జట్టులో చోటు కల్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్లో అతడిని పక్కన పెట్టారు. కేవలం మంచినీళ్లు అందించేందుకు మాత్రమే ఉపయోగించుకున్నారు. తాజా ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా అతనికి అవకాశం ఇవ్వడం లేదు. రెండో మ్యాచ్లో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. ఇంకా నాలుగు మ్యాచ్లు మిగులు ఉన్నాయి. బ్రూక్, బట్లర్, సాల్ట్ వంటి అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్లు ఉన్నారు. వారిని అడ్డుకోవాలంటే బౌలింగ్ బలపడాలి. బ్యాటింగ్ అంతకంటే బలపడాలి. ఆతిథ్య జట్టు మందు భారీగా లక్ష్యాలను విధించకపోతే టీమిండియా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. లోపాలు కనిపిస్తున్నప్పటికీ మేనేజ్మెంట్ పెద్దగా దిద్దుబాటు చర్యలకు దిగడం లేదు. సీనియర్ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వకుండా మానడం లేదు. ఇదే కనుక సాగితే ఇంగ్లాండ్ సిరీస్ లోనూ టీమిండియాకు ఊహించని ఫలితం వస్తుంది. అప్పుడు చింతించి లాభం ఉండదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper