Vaibhav Suryavanshi: 15 సంవత్సరాలకే క్రికెట్లోకి వచ్చాడు. ఒక ప్రొఫెషనల్ బ్యాటరీ కంటే ఎక్కువ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. పెద్దపెద్ద బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని తీసి అవతలపడేస్తున్నాడు. అవలీలగా సిక్సర్లు కొడుతున్నాడు. సులభంగా ఫోర్లు బాదుతున్నాడు. మైదానంలో పరుగుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. సునామీ మాదిరిగా ప్రత్యర్థి బౌలర్ల మీద రెచ్చిపోతున్నాడు. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో సూర్య వంశీ చేసి చూపించాడు. ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సూర్య వంశీ ఆట తీరును గమనించిన బిసిసిఐ.. కీలక నిర్ణయం తీసుకుంది.
ఎంతటి అంతర్జాతీయ క్రికెటర్ అయినా సరే.. దేశీయంగా కొన్ని మ్యాచ్లు ఆడాలి. వారి స్థాయిని నిరూపించుకోవాలి. అంతర్జాతీయ మ్యాచులు లేనప్పుడు.. ఆటగాళ్లలో సామర్థ్యాన్ని పరీక్షించడానికి బీసీసీఐ కూడా డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ టోర్నీలలో టీమిండియా ప్లేయర్ల ఆట తీరు అంత గొప్పగా లేదు. ముఖ్యంగా కొంతమంది ప్లేయర్లు దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో వారి సామర్థ్యాన్ని మెరుగు పెట్టడానికి బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు నిర్వహించబోతోంది. ఇందులో భాగంగానే దులీప్ ట్రోఫీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి భారత జట్టును ప్రకటించింది.
దులీప్ ట్రోఫీలో భాగంగా ఈస్ట్ జోన్ స్క్వాడ్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఈ జట్టుకు నాయకుడిగా ఈశాన్ కిషన్ వ్యవహరించబోతున్నాడు. ఉప నాయకుడిగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ ఎంపిక అయ్యాడు. ఈ జట్టులో అభిమన్యు ఈశ్వరన్, ముఖేష్ కుమార్.. మహమ్మద్ షమీ.. షహబాజ్ అహ్మద్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ వైభవ్ మీద నమ్మకం పెట్టుకోవడం విశేషం. పైగా అతడికి ఉపసారథిగా బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
ఇటీవల కాలంలో సూర్య వంశీ స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తున్నాడు. టి20లలో అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్డేలలో కూడా సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు దులీప్ ట్రోఫీ లో ఏకంగా వైస్ కెప్టెన్ హోదా పొందడం విశేషం. సీనియర్లను కాదని ఇతడికి అవకాశం ఇచ్చిందంటే మేనేజ్మెంట్.. ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కేవలం డొమెస్టిక్ క్రికెట్ మాత్రమే కాదని.. వచ్చే రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు సారధిగా సూర్య వంశీ ఎంపిక కావాలని.. అతని అభిమానులు కోరుకుంటున్నారు.