Anand Sai: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి రూప కర్త, టీటీడీ బోర్డు సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు ఆనంద్ సాయి కుమారుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నగరం లోని రాయదుర్గం పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ – ఖాజాగూడ రహదారి ఫై హిట్ & రన్ ప్రమాద ఘటన లో ఆనంద్ సాయి కుమారుడు సందీప్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దుర్ఘటలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. మరీనా వ్యక్తి పేరు నందూలాల్. తీవ్ర గాయాలపాలైన వ్యక్తి పేరు జైద్ షా ఖాద్రీ. ప్రమాదం జరిగిన వెంటనే వీళ్ళిద్దరిని హాస్పిటల్ కి తరలించారు. నందూలాల్ అప్పటికే చనిపోయి ఉండగా, జైద్ షా అనే విద్యార్థి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ప్రమాదం జరిగిన వెంటనే సందీప్ అక్కడి నుండి పరారు అయ్యాడు. దీంతో సైబరాబాద్ పోలీసులు వెంటనే అతన్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అతని పై పలు సెక్షన్లు విధించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎవ్వరూ కావాలని యాక్సిడెంట్ చేయరు, అనుకోకుండా జరుగుతుంటాయి. మన వల్ల ఒకరి ప్రాణం పోయినప్పుడు స్వచ్చందంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోవాలి. అంతే కాదు, గాయాలపాలైన వ్యక్తులను స్వయంగా తన కారు లో ఎక్కించుకొని హాస్పిటల్ కి అయినా తీసుకొని వెళ్లి ఉండాలి. ఇవేమి చేయకుండా , గుద్దేసి చెప్పాపెట్టకుండా పరార్ అవ్వడం దురదృష్టకరమైన సంఘటన. ఈమధ్య కాలం లో ఇలాంటి యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అది జనసేన పార్టీ కి సంబంధించిన వాళ్ళే చేయడం గమనార్హం. రీసెంట్ గానే జనసేన రాజ్య సభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు కూడా ఇదే తరహా యాక్సిడెంట్ చేసాడు. ఈ ఘటన జరిగిన కొద్దీ రోజులకే అదే పార్టీ కి చెందిన వ్యక్తి కుమారుడు ఇలాంటి పని చేయడం విచారకరం.