Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: 18 ఏళ్ళు వచ్చాక అమ్మాయిలను చూసి వైభవ్ ఆగుతాడా..

Vaibhav Suryavanshi: 18 ఏళ్ళు వచ్చాక అమ్మాయిలను చూసి వైభవ్ ఆగుతాడా..

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ టీమ్ ఇండియా క్రికెట్లో యంగ్ సెన్సేషన్. ఇతడు ఆడుతుంటే తుఫాన్ స్థాయిలో ఉంటోంది. అతడు పరుగులు తీస్తుంటే మెరుపు వేగం కళ్ళ ముందు కనిపిస్తోంది. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే సంచలనం నమోదవుతోంది. సూర్య వంశీ ఇప్పటికే అనేక సందర్భాలలో తనను తాను నిరూపించుకున్నాడు. కొత్తగా అతని గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. పైగా అతని బ్యాటింగ్ అంచనాలకు మించి సాగుతోంది. ప్రత్యర్థి జట్టుతో సంబంధం లేదు. వేదికతో సంబంధం […]

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ టీమ్ ఇండియా క్రికెట్లో యంగ్ సెన్సేషన్. ఇతడు ఆడుతుంటే తుఫాన్ స్థాయిలో ఉంటోంది. అతడు పరుగులు తీస్తుంటే మెరుపు వేగం కళ్ళ ముందు కనిపిస్తోంది. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే సంచలనం నమోదవుతోంది.

సూర్య వంశీ ఇప్పటికే అనేక సందర్భాలలో తనను తాను నిరూపించుకున్నాడు. కొత్తగా అతని గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. పైగా అతని బ్యాటింగ్ అంచనాలకు మించి సాగుతోంది. ప్రత్యర్థి జట్టుతో సంబంధం లేదు. వేదికతో సంబంధం లేదు. బౌలర్ తో పనిలేదు. అతడికి కావలసింది కేవలం పరుగులు. అది కూడా లిప్త పాటు కాలంలో.. తక్కువ బంతుల్లో.. అందువల్లే అతడిని బేబీ బాస్ అని పిలుస్తున్నారు.

గేల్ లాంటి ప్లేయర్ల సైతం అతడి ఆట చూసి మైమరిచి పోతున్నారంటే మామూలు విషయం కాదు. పైగా అతడు పరుగులు తీయడంలో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తున్నాడు. అతడి జోరు ఇలానే కొనసాగితే టీమ్ ఇండియాకు ఎదురు అనేది ఉండదని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో రాబిన్ ఊతప్ప లాంటి సీనియర్ ప్లేయర్లు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.

వైభవ్ సూర్య వంశీ వయసు ప్రస్తుతం 15 సంవత్సరాలు మాత్రమేనని.. అతడికి 18 సంవత్సరాలు వయసు వచ్చేసరికి అమ్మాయిలు అటెన్షన్ మార్చుతారని.. దానిని ఎంతవరకు నిగ్రహించుకోగలిగితే అతడు తన కెరియర్ అంత గొప్పగా మార్చుకోగలుగుతాడని ఊతప్ప చెబుతున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్ మొత్తాన్ని మార్చేయగలిగే శక్తి అతడికి ఉందని.. కాకపోతే స్వీయ నియంత్రణ అతడు పాటించాల్సిన అవసరం ఉందని ఊతప్ప పేర్కొన్నాడు. సచిన్ మాదిరిగానే వైభవ్ కు అద్భుతంగా ఆడే సత్తా ఉందని.. అతడు దానిని మరింత మెరుగుపరుచుకుంటే అద్భుతమైన ఆటగాడిగా రూపాంతరం చెబుతాడని ఊతప్ప వివరించాడు.

“బేబీ బాస్ వయసు ప్రస్తుతం 15 సంవత్సరాలు. అతడు పూర్తిస్థాయిలో ఆట మీద దృష్టి కేంద్రీకరిస్తే అద్భుతాలు సృష్టించగలుగుతాడు. అతని బ్యాటింగ్ అంచనాలకు మించి సాగుతోంది. టీమిండియాలో సచిన్ ఎలాంటి ప్రమాణాలు నెలకొల్పాడో .. అంతకుమించి నెలకొల్పే సామర్థ్యం సూర్య వంశీకి ఉంది. అలాంటప్పుడు అతడు తన వయసు పెరుగుతున్నప్పుడు.. ముఖ్యంగా టీనేజీలో అమ్మాయిల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని.. అదే అతడి కెరియర్ మొత్తాన్ని నిర్దేశిస్తుందని” వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి రాబిన్ ఊతప్ప ఈ సందర్భంగా వివరించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper