Wife Elopes With Lover: అనైతికమని తెలుసు. పద్ధతి కాదని కూడా తెలుసు. అయినప్పటికీ చాలామంది మారడం లేదు. తమ తప్పు తెలుసుకోవడం లేదు. వయసువేడిలో.. ఇంకా రకరకాల కారణాల వల్ల ఏం చేస్తున్నారు తెలియడం లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. మొత్తానికి అయితే దారి తప్పుతున్నారు.
ఇలా దారి తప్పిన క్రమంలో చేయకూడని దారుణాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో వారు తాము మనుషులమనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోతున్నారు. అనైతికమైన బంధాల మోజులో పడి కట్టుకున్న వాళ్లను మోసం చేస్తున్నారు. చివరికి కన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టి పారిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. చివరికి తాము చేస్తున్న అనైతికమైన వ్యవహారాలను సమర్థించుకునే స్థాయికి మనుషులు దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో 21 సంవత్సరాల క్రితం ఒక యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. అయితే ఇటీవల ఆ మహిళ తనకంటే 13 సంవత్సరాల చిన్న వాడైన ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అతనితో వ్యవహారం మొదలుపెట్టింది. ఇది భర్తకు తెలిసింది. అయినప్పటికీ ఆమెను ఏమీ అనలేదు. చివరికి ఆ కుర్రాడితో ఆమె పారిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలో భార్యకు.. భర్తకు గొడవలు జరిగాయి. చివరికి ఆ మూడు కుటుంబాలు కూర్చొని పంచాయతీ చేసుకున్నాయి. పెద్దమనుషుల తీర్మానం ప్రకారం ఆ యువకుడికి.. ఆ మహిళకి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆ యువకుడితో ఆ మహిళకు ఆ భర్త దగ్గరుండి పెళ్లి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
నేటి కాలంలో భార్యలు భర్తలను చంపుతున్నారు. ప్రియుళ్ల హతమార్చుతున్నారు. ఇలా చావడం కంటే ముందుగానే జాగ్రత్త పడి పెళ్లి చేశావు.. ఇప్పటికైనా నువ్వు ప్రశాంతంగా ఉండు. దరిద్రం పోయిందనుకొని హాయిగా ఉండు.. జరిగింది జరిగిపోయింది. ఇది నీ మంచికే అనుకో. ఇకపై జీవితాన్ని నీకు నచ్చినట్టు గడుపు అంటూ.. నెటిజన్లు ఆ భర్తకు చెబుతున్నారు. అయితే ఆ ఐదుగురు పిల్లల బాధ్యత ఎవరు తీసుకున్నారు.. పెద్దమనుషులు ఎవరికి అప్పగించారు.. అనే విషయాల మీద ఇంతవరకు క్లారిటీ రాలేదు.. కాకపోతే ఆ వ్యక్తి ఆ పెళ్లి చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. అంతే కాదు పెళ్లి చేసిన తర్వాత హాయిగా ఉండు అంటూ భార్యను దీవించి వెళ్లిపోయాడు.