Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ 15 ఏళ్ల బుడ్డోడు కాదు రా బాబూ.. డైనమైట్.....

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ 15 ఏళ్ల బుడ్డోడు కాదు రా బాబూ.. డైనమైట్.. గెలికితే దబిడి దిబిడే

Vaibhav Suryavanshi: బుడ్డోడు కదా అని ట్రోల్ చేశారు. 15 సంవత్సరాల బాలుడే కదా అంటూ పరిహాసమాడారు. వాళ్లకు తెలియదు కదా వాడొక డైనమైటని.. తిక్క రేగితే తిత్తి తీస్తాడని.. చివరికి అర్థమైంది.. కాకపోతే ఆలస్యంగా.. ఆ బుడ్డోడికి తిక్క రేగింది.. లెజెండ్ సినిమాలో బాలయ్య గనుక జగపతిబాబు మీదికి వెళ్ళినట్టు దూసుకుపోయాడు. కొంతలో తప్పిపోయింది.. లేకుంటే నా శాల్తీలు గల్లంతయ్యేవి.

అసలే శ్రీలంక సిరీస్ లో వైభవ్ సూర్య వంశీ అంచనాలకు తగ్గట్టుగా ఆడటం లేదు. రెండు మ్యాచ్లలో తన ప్రతాపాన్ని అతడు చూపించలేకపోయాడు. పైగా టీమిండియా ఓడిపోయింది. సూపర్ ఓవర్లో శ్రీలంక ముందు తలవంచింది.. సరిగా ఆడలేక పోయాను అనే బాధ.. సూపర్ ఓవర్ లో టీమిండియా ఓడిపోయిందనే కోపం.. ఇవన్నీ సూర్య వంశీలో తీవ్రస్థాయిలో అసహనం పెంచాయి. మిగతా ప్లేయర్లు ఓటమిని సహజంగా తీసుకుంటారు. కానీ సూర్య వంశీ అలా కాదు. అతడికి ప్రతి మ్యాచ్లో గెలవాలని మాత్రమే ఉంటుంది.. ఓటమిని అసలు ఒప్పుకోడు. బహుశా 15 సంవత్సరాల వయసు కాబట్టి.. అలానే ఉంటుందేమో.

అతడి గురించి తెలియక.. శ్రీలంక ప్లేయర్లు గేలి చేశారు. బుడ్డోడు అంటూ ఆటపట్టించారు. అతడికి తిక్క రేగింది. బుల్డోజర్ లాగా దూసుకుపోయాడు. శ్రీలంక ప్లేయర్లను ఒక తొక్కుడు తొక్కాలని అనుకున్నాడు. ఈ సమయంలోనే శ్రీలంక కీపర్ అడ్డంగా వచ్చి.. సూర్యవంశీని సముదాయించాడు. దీంతో గొడవ ఆగిపోయింది. తుఫాను తేలిపోయింది. సునామి ప్రశాంతతను పొందింది. లేకుంటే నా సినిమా వేరే తీరుగా ఉండేది. ఆ తర్వాత సూర్య వంశీ ఏదో తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో తిరుగుతున్నాయి. ఇది కదా మాకు కావాల్సింది అంటూ టీమిండియా అభిమానులు వైభవ్ సూర్య వంశీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AP Heavy Rains

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...
TDP MLC Candidates

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...
ADR Report 2026

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...
West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....
Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper