క్రీడలుక్రికెట్‌Suyash Sharma Viral Pic: సూయాషూ.. మంత్రాలేసి వికెట్లు తీశావా? వైరల్ పిక్

Suyash Sharma Viral Pic: సూయాషూ.. మంత్రాలేసి వికెట్లు తీశావా? వైరల్ పిక్

Suyash Sharma Viral Pic: ఈసారి ఐపీఎల్లో ఛాంపియన్ గా నిలిచిన కన్నడ జట్టులో ఎంతోమంది ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. అందులో సుయాష్ శర్మ అనే యువ బౌలర్ కూడా ఒకడు. 2003 లో పుట్టిన ఇతడు.. ఈ ఏడాది కన్నడ జట్టులో మెరిశాడు. 22 సంవత్సరాల ఈ యువకుడు ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు.. ఈ సీజన్లో ముఖ్యంగా క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో అయ్యర్ జట్టుపై బంతితో చెలరేగిపోయాడు. 17 పరుగులు మాత్రమే ఇచ్చి అయ్యర్ జట్టులో కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి పంజాబ్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. ఇతడు వికెట్లు తీయడంతో పంజాబ్ జట్టు ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా సాగలేకపోయింది. అందువల్లే కన్నడ జట్టు ఆ మ్యాచ్లో గెలిచి నేరుగా చివరి అంచె పోటీకి వెళ్లిపోయింది. ఒకరకంగా కన్నడ జట్టు ఛాంపియన్ గా నిలవడానికి సుయాష్ తన వంతుకు మించి పాత్ర పోషించాడు అని చెప్పవచ్చు. నాటి మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన నేపథ్యంలో శర్మపై అభినందనల జల్లు కురిసింది. చివరి అంచె పోటీలో సుయాష్ క్రికెట్లు సాధించ లేకపోయినప్పటికీ.. మెరుగైన బౌలింగ్ వేసి ఆకట్టుకున్నాడు.

సుయాష్ శర్మ కట్టుదిట్టంగా పంజాబ్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో బౌలింగ్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ బీమర్ అద్భుతమైన ఫోటో రూపొందించాడు. బంతిని వేస్తున్న సమయంలో రెండు చేతులలో దాన్ని పట్టుకొని.. సుయాష్ ఏదో చదివాడని.. ఒకరకంగా మంత్రాలు వేసి బంతులు సంధించాడని.. అందువల్లే అతడికి వికెట్లు పడ్డాయని.. ఆ మీమర్ ఉద్దేశం. దీంతో ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో తెగ సర్కులేట్ అవుతోంది.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..” అయ్యర్ జట్టు పై వికెట్లు తీయడానికి ప్రధాన కారణం ఇదా? మంత్రాలు వేసి వికెట్లు నేలకూల్చావా? అందువల్లే క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో అయ్యర్ జట్టు పై విజయం సాధ్యమైందా.. నువ్వు మామూలోడి కాదు.. మంత్రాలు వేసి బౌలింగ్ చేసావంటే నువ్వు చాలా గొప్పోడివి అని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

కొంతమంది క్రికెటర్లు మాత్రం.. మంత్రాలు గింత్రాలు ఉండవని.. కేవలం హార్డ్ వర్క్ మాత్రమే ఒక ఆటగాడికి గొప్పదనాన్ని ఇస్తుందని.. అదే అతడిని చిరస్థాయిగా నిలబెడుతుందని పేర్కొంటున్నారు. శర్మ మైదానంలో తీవ్రంగా శ్రమించాడని.. వికెట్లు తీయడంలో పట్టు సాధించాడని.. అందువల్లే ఆ స్థాయిలో అయ్యర్ జట్టుపై చెలరేగిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. అద్భుతమైన ప్రతిభ చూపిన ఆటగాడిని ప్రోత్సహించాలని.. అంతే తప్ప ఇలా మంత్రాలు చేస్తున్నాడు… క్రికెట్ లు తీయడానికి ఏవేవో పనులు చేస్తున్నాడని వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. అవసరమైతే అతడిని ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ammu❤️✨ (@amul_babby01)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

RCB Criticism to Victory : ఎన్ని హేళనలు.. ఎన్ని విమర్శలు.. అన్నింటిని తట్టుకొని విజేతగా..

RCB Criticism to Victory : ఫీనిక్స్ పక్షి బూడిదలో నుంచి ఎగిరి లేస్తుంది. ఒకరకంగా దానికి ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. తన శక్తి మీద అపారమైన నమ్మకం ఉంటుంది. అందువల్లే ఆ పక్షిని ఆత్మస్థైర్యానికి సిసలైన ప్రతీకగా చెప్పుకుంటారు.

Shashank Singh : ఇంకో రెండు బాల్స్ కనుక ఉండి ఉంటే.. ఇతడు సగం దేశానికి నిద్రలేకుండా చేసేవాడు!

Shashank Singh : 190.. కన్నడ జట్టు అయ్యర్ సేన తో ఐపీఎల్ చివరి అంచె పోరులో చేసిన స్కోర్. పంజాబ్ జట్టు గెలవాలంటే చేయాల్సిన స్కోర్ 191. ఈ దశలో చేజింగ్ కు వచ్చిన అయ్యర్ జట్టు.. గెలుపు దిశగా వచ్చినప్పటికీ.. వికెట్లను కోల్పోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది.

Most Popular

FIFA World Cup 2026

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...
Trump FIFA Club World Cup

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...
Rohit Sharma

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్...

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా...
Rohit Sharma

Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ని కూడా టీమిండియా కోల్పోయింది. సిరీస్ భవితవ్యాన్ని తెలిసే మూడో మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోయింది. కేవలం...