RGV On Amitabh Bachchan: కాంట్రవర్షియల్ కామెంట్స్ తో నిత్యం ట్రెండింగ్ లో ఉండే దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). దానికి ఆయన తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా చెప్తుంటాను అని చెప్పుకుంటాడు కానీ, అవసరం లేని సందర్భాల్లో కూడా ఆయన దూరి అనేక కామెంట్స్ చేసి విమర్శలపాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లపై గతంలో ఆయన చేసిన కామెంట్స్ కి జైలు గోడల చివరంచుల వరకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుండి ఇక మీదట రాజకీయ పరమైన కామెంట్స్ చేయనని చెప్పుకొచ్చాడు. కానీ సందర్భానికి తగ్గట్టుగా ఆయన ఇప్పటికీ కామెంట్స్ ఎదో ఒక రూపం లో చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ఆయన అమితాబ్ బచ్చని ఉదహరించి చిరంజీవి, రజనీకాంత్ లపై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: జూన్ 12 న ‘హరి హర వీరమల్లు’ సినిమా వస్తుంది అనుకున్నారు..కానీ ట్రైలర్ వస్తోంది..సినిమా ఎప్పుడో!
ఆయన మాట్లాడుతూ ‘ అప్పట్లో మన సౌత్ హీరోలు అమితాబ్ బచ్చన్(Amitab bachhan) సినిమాలను తెగ రీమేక్ చేసేవారు. 1970, 1980 కాలంలో చిరంజీవి(Megastar Chiranjeevi), రజనీకాంత్(Superstar Rajinikanth), ఎన్టీఆర్, రాజ్ కుమార్ వంటి లెజెండ్స్ అమితాబ్ సినిమాలను రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు. చిరంజీవి, రజనీకాంత్ వంటి వారు అయితే అమితాబ్ హీరోయిజం ని కాపీ కొట్టేవారు. వాళ్ళు చేసిన ఎన్నో కమర్షియల్ సినిమాలకు మూలం అమితాబ్ సినిమాలే. అలా వాళ్లకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఇప్పటికే ఆ స్టేటస్ తోనే వాళ్ళు కొనసాగుతున్నారు. 1990 వ సంవత్సరం తర్వాత అమితాబ్ బచ్చన్ 5 ఏళ్ళ పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ సమయం లోనే కొన్ని మ్యూజిక్ కంపెనీలు రంగం లోకి దిగాయి. కేవలం మ్యూజిక్ కోసం మాత్రమే వాళ్ళు కొన్ని సినిమాలు చేశారు. అలా వచ్చిన సినిమానే ‘మైనే ప్యార్ కియా’. అలాంటివి ఆ తర్వాత ఎన్నో వచ్చాయి. కానీ సౌత్ లో మాస్ మసాలా సినిమాలు తీయడం మాత్రం ఆగలేదు. అలా మాస్ మసాలా సినిమాలకు స్ఫూర్తిని ఇచేలా చేసింది అమితాబ్ బచ్చన్. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ సినిమా అనేది పుట్టింది అమితాబ్ నుండే’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయం లో రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ గానే చెప్పాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గురించి చిరంజీవి ని, రజనీకాంత్ ని అడిగినా ఇదే చెప్తారు అంటూ చెప్పుకొచ్చారు.